Home » INDvsPAK : భారత్, పాక్ మ్యాచ్ డేట్ మార్పు.. వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

INDvsPAK : భారత్, పాక్ మ్యాచ్ డేట్ మార్పు.. వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు దాదాపు 40 రోజులపాటు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే ఈ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ… మ్యాచ్ల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

బిసిసిఐ మరియు ఐసీసీ సంస్థలు… ప్రస్తుతం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి. మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియం లో జరగనున్నట్లు ప్రకటించింది. అయితే అదే రోజున గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీంతో నవరాత్రి ఉత్సవాల కోసం పోలీసులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే… సెక్యూరిటీ ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే దీనిపై తాజాగా బిసిసిఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన కాకుండా… ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 14వ తేదీన నిర్వహించాలని అనుకుంటోందట. ఇక ఇవాళ సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనుందట బీసీసీఐ. దీంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు. మ్యాచ్‌ డేట్‌ మారితే… అనేక ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading