Home » Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవినే భయపెట్టిన సినిమా ఏదో తెలుసా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవినే భయపెట్టిన సినిమా ఏదో తెలుసా..?

by Mounika
Ad

 ఒక వ్యక్తి  ఎదగాలి అంటే ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే వారికి ఎదురైన సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళతారో అప్పుడు మాత్రమే వారు ఉన్నత స్థానానికి చేరుకోగలరు. ఈ మాటలు సినీ రంగానికి బాగా వర్తిస్తాయి. ఎందుకంటే ఏ సినిమాలోనైనా నటించే హీరో  వారి సినిమాలకు వచ్చే సక్సెస్ మరియు ఫ్లాప్ ఫలితాలని ఒకే విధంగా తీసుకోవాలి. ఒక సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి.. వారు నటించే క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

 

ఎలాంటి సినీబ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని తెలుగు ప్రేక్షకులలో ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఆయన సినీ కెరియర్ ఆరంభంలో ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్న చిరంజీవి నేడు ఇండస్ట్రీకి పెద్దగా రాబోయే తరం హీరోలకు  స్ఫూర్తిగా నిలిచారు.  సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 40 సంవత్సరాలు పూర్తయినా కూడా చిరంజీవి నటనలో ఉండే గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు.

ఆరు పదుల వయసు దాటినా కూడా  యువ హీరోలకు పోటీగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. అలాంటి చిరంజీవి కెరియర్ లో కూడా ఓ సినిమా ఆయనను బాగా భయపెట్టిందట. ఆ సినిమా పేరు వింటే ఇప్పటికి ఆయన  గుండెల్లో రైళ్లు పరిగెడతాయని  పలు సందర్భాలలో చిరంజీవి తెలియచేశారు. ఇంతకీ చిరంజీవినినే భయపెట్టిన ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 1989లో బి. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి, రాధ, భానుప్రియ హీరో హీరోయిన్లుగా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం స్టేట్ రౌడీ. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి  అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అప్పటివరకు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన చిరంజీవి  సక్సెస్ కి  స్టేట్ రౌడీ చిత్రం ఒక్కసారిగా బ్రేక్ వేసిందట. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన  స్టేట్ రౌడీ మూవీ డిజాస్టర్ టాక్ రావడంతో చిత్ర బృందం ఈ సినిమాపై  మొదట వచ్చిన ఫలితాలపై  నిరాశ వ్యక్తం చేశారట. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో కొందరు చిరంజీవి యాక్టింగ్, డాన్స్ పట్ల  ప్రశంశలు కురిపించారట. ఇలా స్టేట్ రౌడీ సినిమా మొదట నెగిటివ్ టాక్ నుంచి పాజిటివ్ టాక్ ఏర్పడింది.  అలా స్టేట్ రౌడీ సినిమా సక్సెస్ కావడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఇలా మొదట్లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని అనంతరం సక్సెస్ అయినటువంటి ఈ సినిమాని తలచుకుంటే ఇప్పటికీ కొన్నిసార్లు భయం వేస్తుందని చిరంజీవి తెలియజేశారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. ఇండియాలో ఏ హీరో కి కూడా సాధ్యం కాలేదు..!

Tamanna: ఉపాసన అసలు ఏ డైమండ్ రింగ్ ఇవ్వలేదు… ఆ ఫోటో వెనుక అసలు విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు!

Visitors Are Also Reading