వర్షాకాలంలో వర్షాలు కురవడం అనేది కామన్. ఆ సమయంలోనే నదులు, సరస్సులు ఫుల్ గా నీటితో నిండిపోతుంటాయి. ఈ సీజన్ హాయిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. హడలు పుట్టించే వ్యాధులను కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఈ సీజన్ మొదలయ్యేటప్పటికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెట్టాలి. లేదంటే సూచనలేని వర్షాల కారణంగా వ్యాధుల బారిన పడక తప్పదు.
Advertisement
వర్షాకాలంలో చాలామందికి చెవి కి సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి. చాలా మంది వర్షా కాలంలో చెవి నొప్పితో బాధపడుతూ ఉంటారు. సీజన్ మారినప్పుడల్లా మన శరీరం గురించి శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. అది పట్టించుకోక పోవడం వల్లనే అనేక సమస్యల బారిన పడుతూ ఉంటాము. వాటిల్లో ఒకటి చెవి నొప్పి కూడా. చెవులను సరిగ్గా పట్టించుకోక పోవడం వలన చెవి నొప్పితో బాధపడాల్సి వస్తుంది.
Advertisement
అందం పై, చర్మ సంరక్షణపై చూపించే శ్రద్ద ఇతర అవయవాలపైనా చూపించాలి. ముఖ్యంగా చెవుల విషయంలో. లేదంటే, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వానాకాలంలో ఫంగల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తేమ వలన చెవిలో సూక్ష్మ క్రిములు చేరి నొప్పి తెప్పిస్తుంటాయి. చాలా మంది చెవుల్లో తేమని తొలగించడానికి ఇయర్ బడ్స్ వాడతారు. కానీ, నాణ్యత లేని వాటిని వాడడం వలన చెవులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. స్నానం చేసాక ఇయర్ బడ్స్ వాడడం కంటే.. కాటన్ వస్త్రాన్ని నలిపి చెవుల్లో దూర్చి తేమని తుడవడం మంచిది. అలాగే.. అధికంగా సౌండ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ వాడడం కూడా అంత మంచిది కాదు. అలాగే ఇతరుల ఇయర్ ఫోన్స్ వాడడం వలన వారి ఇన్ఫెక్షన్స్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో చల్లని పానీయాలను అవాయిడ్ చేయడం బెటర్. ఇలా చెవిలో నొప్పి లేదా చెవి పోటు వచ్చినప్పుడు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని..
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?
7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
గ్రాండ్ గా SRH కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ పెళ్లి…ఫోటోలు వైరల్