దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీలు, రాజకీయనాయకులు పలువురిని కరోనా వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే డాక్టర్ల కూడా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో వందలాది మంది డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డట్టు అధికారులు వెల్లడించారు. అయితే వారందరూ కూడా ఇంటి వద్ద ఉండి చికిత్స పొందుతున్నారు.
Advertisement
Advertisement
ఈ తరుణంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగానే కరోనా బారీనా పడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 44 మంది డాక్టర్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అందులో 30 మంది మెడికోలు, వీరితో పాటు 10 మంది పీజీ వైద్యులు, నలుగురు ప్రొఫెసర్లకు పాజిటివ్ సోకినట్టు తేలింది. అలాగే వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో కూడా 30 మంది మెడికోలు కరోనా బారిన పడ్డారు.
అదేవిధంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో 60 మందికి పైగా వైద్యులు, వైద్యవిద్యార్థులకు కరోనా సోకినట్టు వెల్లడి అయింది. థర్డ్ వేవ్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో వైద్యులు ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.