ఆర్సీబీ కి కీ ప్లేయర్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ తన అభిమానులకు స్వీట్ న్యూస్ చెప్పారు. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య వినీ రామన్ సీమంతాన్ని ఘనంగా జరిపించారు. ఈ ఘటనతో భారతీయ సంప్రదాయాలకు ఉన్న విశిష్టత మరోసారి రుజువైంది. అంతర్జాతీయంగా భారతీయ సంప్రదాయాలకు ఉన్న ప్రత్యేకత గురించి తెలిసిందే. ఎందరో విదేశీయులు, ప్రముఖులు సైతం ఇక్కడి ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇష్టపడుతుంటారు.
Advertisement
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ గతేడాది చెన్నై కి చెందిన వినీ రామన్ను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి సైతం హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా జరిగింది. అప్పటి నుంచి మ్యాక్స్ వెల్ భారతీయ సంప్రదాయాలపై మక్కువ పెంచుకుని వాటిని ఆచరించడం ప్రారంభించారు. ఇటీవల వీరిద్దరూ తల్లి తండ్రులు కాబోతున్న విషయాన్నీ వినీ రామన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్ లో ఆమె తన బిడ్డకి జన్మనివ్వనున్నారు.
Advertisement
ఈ క్రమంలోనే మ్యాక్స్ వెల్ ఆమెకు బేబీ షవర్ వేడుకను జరిపించారు. ఈ వేడుక అచ్చం హిందూ సాంప్రదాయ బద్ధంగా జరిగింది. ఈ వేడుకలో వినీ రామన్ కట్టు బొట్టు అందరిని ఆకట్టుకుంటున్నాయి. విన్నీ పట్టు చీర, బంగారు నగలను ధరించి ఉండగా.. మ్యాక్స్వెల్ సహా కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా వేడుకను జరిపించారు. ఈ విషయాన్నీ విన్నీ తన ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మూడో భార్య ఎవరో తెలుసా..? వారి ప్రేమ ఎక్కడ పుట్టిందంటే !
హీరోల బిహేవియర్ వల్ల సినిమాలనే వదిలేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..?