మెగా జంట రామ్ చరణ్ మరియు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ జంటకు ప్రేమకి ప్రతిరూపంగా కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వివాహమైన 11 ఏళ్ల తర్వాత పుట్టిన కూతురు క్లీంకార తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మూడు రోజుల క్రితం తన భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా చరణ్ తన కుమార్తె క్లీంకార వీడియోను ఆయనా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఆ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్స్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఉపాసన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్ ఉపాసనపై చేసిన ఆ వ్యాఖ్యలు కాస్త నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బట్టలు విక్రయించే యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హాస్యనటుడు తన్మయ్ భట్ అతనికి ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చరణ్.
ఇందులో భాగంగానే తన స్టైలింగ్ , ఆన్ లైన్ షాపింగ్ , స్నేహితులకు గిఫ్ట్ లు అందజేస్తానని చరణ్ తెలిపాడు. తనకు పెళ్లయ్యాక తన భార్య ఉపాసన కోసం చాలా ఖరీదైన బహుమతిని కొన్నానని, ఆ బహుమతి ఆమెకు ఇవ్వాలని చాలా ప్రయత్నించాను. అయితే ఆమె దానిని కేవలం ఐదు సెకన్లులో నా ముఖం మీదే విసిరివేసిందని గుర్తు చేసుకున్నాడు.
ఆ వస్తువు కొనడానికి నాకు దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. తీరా అయిదు సెకండ్లు కూడా చూడకుండా దానిని పక్కన పడేసింది ఉపాసన. కాబట్టి ఆడవారికి సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి ట్రై చేయకండి. వాళ్ళు ఆ వస్తువును ఇష్టపడతారా లేదా అనే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాళ్లని అడిగిన తరువాత ఏదైనా కొనుక్కోవడం మంచిదని నా ఫీలింగ్ అంటూ రాంచరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
జపాన్ లో రికార్డులను సృష్టిస్తున్న రామ్ చరణ్ రంగస్థలం మూవీ..! ఇప్పటికీ ఎంత వసూలు చేసిందంటే..
అతనితో నాకు పెళ్లి జరుగలేదు.. వనిత విజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..!