నటి వనిత విజయ్ కుమార్ పేరు చెప్పగానే ఎవరికైనా మూడు పెళ్లిళ్ల విషయమే గుర్తుకొస్తుంది. ఇక ఈ ఏడాది మే నెలలో ఈమె మూడో భర్త పీటర్ పాల్ మరణించాడు. అయితే అతను తన భర్త కాదని.. తమకు అసలు పెళ్లి జరగలేదని అప్పట్లో ఈమె ఓ పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి.. లాక్ డౌన్ సమయంలో మ్యారేజ్ చేసుకున్నారు కదా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలపై స్వయంగా ఆమెనే ఓ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూడో పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది వనితా విజయ్ కుమార్. “ లాక్ డౌన్ వల్ల నాలో ఒత్తిడి పెరిగింది. చనిపోతాను అనే భయం వేసింది. దీంతో నాకు ఎవరు అయినా తోడు కావాలనిపించింది. ఒకవేళ నేను చనిపోయినా అప్పటివరకు తోడు ఉంటారు కదా.. అని నేను మూడో పెళ్లి చేసుకోవడం తప్పు ఏం కాదు. అలాగే పీటర్ పాల్ మంచి వ్యక్తి. అతని వల్ల జీవితంలో చాలా విషయాలను తెలుసుకున్నాను.
నా వరకు చూసుకుంటే.. మాకు మాత్రం పెళ్లి జరగలేదు. జస్ట్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాం. కొద్ది రోజులకు నేను నా జీవితాన్ని కోరుకున్నాను. ఆయన వేరే దారిని ఎంచుకున్నప్పటికీ నేను నా దారిలోనే ఉన్నాను. నా వరకు వస్తే.. ప్రేమ అనేది చాలా ముఖ్యం. కానీ అది ఒకవైపు నుంచి వస్తే ఎలా..? నేను ప్రేమ చూపించినప్పుడు అటు వైపు నుంచి కూడా ప్రేమ ఆశిస్తాం కదా” అని వనిత విజయ్ కుమార్ చెప్పారు. ఇటీవలే ఆమె నరేష్-పవిత్ర లోకేష్ నటించిన మళ్లీపెళ్లి మూవీలో నటించింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్ మూవీకి ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడా ?
త్రివిక్రమ్-థమన్ మధ్య వివాదం.. గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్ మారనున్నాడా ?