మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ ముహుర్తాన గుంటూరు కారం మూవీని ప్రారంభించారో కానీ.. రోజుకు ఒక ట్విస్ట్ తో నిత్యం గందరగోళంగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుంది. గత కొద్ది కాలంగా నిత్యం కాంట్రవర్సీలకు తప్ప షూటింగ్ కి నోచుకోని ఈ మూవీ ఇటీవలే అన్నీ సమస్యలను సవరించుకొని మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేసింది. అంత సవ్యంగానే జరుగుతుందనే సమయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీమ్. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతున్న ఈ మూవీ తొలుత ప్రారంభించినప్పుడు పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా షూటింగ్ ప్రారంభమైంది. రెండు, మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరిగిన తరువాత పూజా హెగ్దే ను సినిమాలో నుంచి తీసేశారు.
Advertisement
ఆ తరువాత సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా తీసుకొని మళ్లీ కొత్త సినిమా తీయడం ప్రారంభించారు. ఇటీవలే ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యాక మరో వ్యక్తి సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్త గట్టిగా వినిపిస్తుంది. తాజాగా గుంటూరు కారం మూవీకి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్న పీఎస్ వినోద్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇష్యూ ఏంటో క్లారిటీ లేకపోయినా త్రివిక్రమ్ కి పీఎస్ వినోద్ కు తరచూ మనస్పార్థాలు వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
ఇక ఆయన స్థానంలో ప్రస్తుతం ఓజీ మూవీకి కెమెరామెన్ గా పని చేస్తున్న రవి కె చంద్రన్ గుంటూరు కారం మూవీకి కొత్త సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇన్ని మార్పులు చేసినప్పటికీ షూటింగ్ ఇక నుంచి అయినా జరుగుతుందా అంటే మహేష్ వెకేషన్ పేరుతో మళ్లీ విదేశాలకు వెళ్లిపోయాడు. దీనిని బట్టి చూస్తే గుంటూరు కారం సినిమా అంత ప్రస్తుతం టాలీవుడ్ లోనే అత్యంత గందరగోళం సినిమా అయిపోయిందనిపిస్తుంది. మళ్లీ మహేష్ తిరిగి ఎప్పుడూ వస్తాడో.. షూటింగ్ ఎప్పటికీ అవుతుందో..ఆయన వచ్చేలోపు ఈ టీమ్ అయిన ఇలాగే ఉంటుందో.. ఉండదో అని అందరికీ అనుమానాలు తలెత్తున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అప్పట్లో ఆ హీరోయిన్ తో చిరంజీవికి, బాలకృష్ణకు అలాంటి స్నేహం ఉండేదా ?
ఈ టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..?