2023 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థానంలో టైటిల్ స్పాన్సర్‌గా చైని మొబైత్ తయారు దారు వివో స్థానంలో టాటా గ్రూప్ వ్యవహరిస్తుందని క్రికెట్ లీగ్ చైర్మన్ బ్రిబేష్ పటేల్ పీటీఐకి వెల్లడించారు. అంతకు ముందు భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తత, చైనా వ్యతిరేకత సెంటిమెంట్ మధ్య బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వివో మొబైల్ ఐపీఎల్ 2020 కోసం తమ సంబంధాలను నిలిపివేసాయి.
Advertisement
Advertisement
2018లో ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌గా వివో ఐదేళ్లకాలానికి రూ.2199 కోట్లతో హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు 2018 ఐపీఎల్ సీజన్‌కి రూ.363 కోట్లని బీసీసీఐకి చెల్లించిన వివో కంపెనీ.. 2019 ఐపీఎల్ సీజన్‌కిగానూ రూ.400 కోట్లను బీసీసీఐకి చెల్లించింది.