తెలుగు సినీ ఇండస్ట్రీలో రెండో తరం హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి హీరోలు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా వీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా ఇప్పటి కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ సినిమాలను చేస్తున్న ఓల్డ్ యంగ్ హీరోల గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం.
Advertisement
ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇటీవల సంక్రాంతి బరిలో కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి మూవీతో పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి బోళాశంకర్ మూవీతో రాబోతున్నారు. బాలయ్య కూడా తన 108వ సినిమా భగవంత్ కేసరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఇద్దరూ సీనియర్ హీరోల గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి, బాలయ్య సినీ కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో పని చేశారు. చిరంజీవి తనతో వరుసగా సినిమాలు చేసినా ఆ ఒక్క స్టార్ హీరోయిన్ చిరంజీవి పెళ్లి చేసుకోవాలనుకున్నారట.
Advertisement
ఇందుకు సంబంధించి అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఆ హీరోయిన్ చెన్నైలో ఉంటుందని.. కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి మిస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ బాలయ్యతో స్నేహబంధంతో ఉండేదని.. ఆ సమయంలో చిరంజీవి ప్రేమకు బాలయ్య అండగా నిలిచారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఆ తరువాత ఏమైందో కానీ మెగాస్టార్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. దీంతో ఆ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయిందట. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో.. అబద్దం ఉందో తెలియదు.. కానీ ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ..? కన్ఫర్మ్ అయినట్టేనా..?
వరుణ్, లావణ్య పెళ్లికి ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?