మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైందా..? ప్రేమలో మునిగి తేలుతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే ఏడు అడుగులువేయనున్నారా..? వీరి పెళ్లికి ముహూర్తం ఖరారు అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జూన్ 09న జరిగిన విషయం తెలిసిందే. చాలా కాలం నుంచి వీరిద్దరిపై వచ్చిన రూమర్స్ కి ఎంగేజ్మెంట్ ద్వారా చెక్ పెట్టారు. మెగా, అల్లు ఫ్యామిలీస్ తో పాటు పలువురు సెలబ్రిటీలు, కొంత మంది సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ గ్రాండ్ గానే జరిగింది. మెగా అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
Advertisement
ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ జరుగనుంది ? వంటి వివరాలు మాత్రం చెప్పకపోవడంతో ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తొలుత ప్రచారం జరిగినట్టుగానే ఇటలీలో ఆగస్టు 24న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మ్యారేజ్ ఉండనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ లవ్లీ కపుల్ మధ్య మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఇటలీలో కాబట్టి మ్యారేజ్ అక్కడే ప్లాన్ చేశారని పేర్కొంటున్నారు.
Advertisement
డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి గెస్ట్స్ కూడా లిమిటేడ్ గా ఉండే అవకాశముంది. దీంతో ఎంగేజ్మెంట్ కి, మ్యారేజ్ కి ఫ్యాన్స్ ని ఇన్వైట్ చేయని మెగా ఫ్యామిలీ తరువాత రిసెప్షన్ అయినా హైదరాబాద్ లో ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ సినిమా వరుణ్ పెళ్లి తరువాత విడుదలయ్యే మొదటి సినిమా అవుతుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న వరుణ్ కి పెళ్లి తరువాత విడుదలయ్యే గాండీవధారి అర్జున సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా అనేది వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాజమౌళి కాదు.. ఇప్పుడు అంతా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించే చర్చ..!
సౌందర్య చివరి కోరిక ఇదే..అదేంటో తెలుస్తే ప్రతి మహిళా కన్నీళ్లు పెడుతుంది !