Home » ఐ-ఫోన్ నిషేదించిన రష్యా.. అందుకోసమేనా ?

ఐ-ఫోన్ నిషేదించిన రష్యా.. అందుకోసమేనా ?

by Anji
Ad

రష్యా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారు అయిన యాపిల్ ఐఫోన్ ను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్టు వెల్లడించింది. ఐఫోన్, ఐప్యాడ్ లతో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం రష్యాలో మానేయాలని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి రష్యా వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు ఇకపై ఆఫీస్ ల్లో ఐఫోన్ లను ఉపయోగించడానికి అనుమతించబడరని నివేదికలో వెల్లడించారు.

Advertisement

క్రెమ్లిన్, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ గూఢచారి ఏజెన్సీలో ఆందోళన పెరుగుతుంది. క్రెమ్లిన్ లోని వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో యాపిల్ ఉత్పత్తులను వెంటనే నిషేదించాలని పేర్కొన్నారు. అమెరికా గూఢచార్య సంస్థల గూఢచర్య ప్రయత్నాల పెరుగుదలతో రష్యా ప్రభుత్వం  ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాపిల్ ఉత్పత్తులను నిషేదించినట్టు ప్రభుత్వ ఏజెన్సీకి సంబంధించిన ఓ అధికారి తెలిపారు. మంత్రిత్వ శాఖల్లోని భద్రతా అధికారులు ఎఫ్ఎస్బీ ఉద్యోగులు, ఐఫోన్స్, వాడటం సురక్షితం కాదని వాటికి ప్రత్నామ్నయం గా మొబైల్ ఫోన్ లను ఉపయోగించాలని ప్రకటించారు.

Advertisement

గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన సాప్ట్ వేర్ కి మారాలాని తెలిపారు. దేశానికి సంబంధించిన క్లిష్టమైన ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ లో ఉన్న ఏజెన్సీలు, సంస్థలను ఆరోగ్య సంరక్షణ, విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక రంగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐఫోన్స్ నిషేదం అనేది కొద్ది రోజుల పాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా తమ సాంకేతికతను వైర్ ట్యాపింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు రష్యా భద్రత, గూడఛారి చీఫ్ ఆండ్రీ సోల్డాటోవ్ పేర్కొన్నారు. ఇక ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఐఫోన్లను ఉపయోగించడంతో దేశ రహస్యాలు బయటికీ వెళ్లే అవకాశం ఉండటంతో కొద్ది రోజుల పాటు దానిని నేషిదిస్తున్నట్టు వెల్లడించారు. చాలా కాలంగా దీనిపై ఎఫ్ఎస్బీ ఆందోళన చెందుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వెస్టిండీస్ పై అత్యధిక సెంచరీలు సాధించిన టీమిండియా క్రికెటర్లు వీరే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..?

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రం ఏదో తెలుసా..?

 

Visitors Are Also Reading