పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలైనటువంటి హరిహర వీరమల్లు మూవీపై అటు మేకర్స్ లో, ఇటు ఆడియెన్స్ చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ఉంటుందో.. ఉండదో అని అనుకుంటుండగా తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నింటిలో హరిహర వీరమల్లు మూవీనే ముందుగా షూటింగ్ ప్రారంభం అయింది. హుటాహుటిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసిన దర్శకుడు క్రిష్.. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేశారు.
Advertisement
ఇక ఆ వీడియోతో ప్రేక్షకుల దగ్గరి నుంచి కూడా ఈ మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ తరువాత నుంచి మాత్రం మూవీ పోకడ నత్త నడకన సాగుతుంది. హరిహరవీరమల్లు మూవీ కంటే ఆలస్యంగా ప్రారంభమైన ఓజీ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తో చేస్తున్న బ్రో మూవీ అయితే ఏకంగా జులై 28న విడుదలవుతోంది. ఇండస్ట్రీలో మాత్రం ఈ మూవీ ఇకపై ఉండదనేంతగా మాట్లాడుకుంటుండగా.. ఇటీవలే నిర్మాత ఏ.ఎం.రత్నం ఎలాంటి పరిస్థితిల్లోనైనా ఈ చిత్రాన్ని పూర్తి చేసి తీరుతామని.. కాకపోతే వచ్చే ఏడాది అయినా తీస్తామని చెప్పారు. తాజాగా నిధి అగర్వాల్ హరిహరవీరమల్లు మూవీపై ఫ్యాన్స్ ఉత్సాహపరిచేలా ఓ పోస్ట్ చేసింది.
Advertisement
రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ తన తొలి పోస్ట్ గా ఇండస్ట్రీలో సన్నిహితులైన అందరి ఫోటోలను ఓ వీడియో ద్వారా షేర్ చేశాడు. ఇక ఆ వీడియోలో హరి హరవీరమల్లు మూవీకి సంబంధించి నిధి అగర్వాల్ తో కలిసి ఉన్న ఒక ఫొటో ఉండగా.. ఆ ఫోటోను నిధి షేర్ చేస్తూ.. ఈ సినిమా గురించి మాట్లాడింది. “ పవర్ స్టార్ @pawankalyan Sir, @dirkrish Sir, #AMRathnam Sir తో కలిసి రాబోయే చిత్రం #Hariharaveeramalluay ఎపిక్ జర్నీలో భాగం అయినందుకు కృతజ్ఞతలు. అలాంటి అద్భుతమైన బృందంతో కలిసి పని చేయడం ఓ సంపూర్ణ ఆశీర్వాదం. నన్ను నమ్మండి, మీరు అందరూ త్వరలోనే ఓ అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు” అంటూ పోస్ట్ చేసింది నిధి అగర్వాల్. ఈమె చేసిన పోస్ట్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో హరి హరవీరమల్లు మూవీపై అంచనాలు పెరిగాయనే చెప్పవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాజమౌళి నటించి, దర్శకత్వం వహించిన మూవీ అంతగా ఆకట్టుకోలేదనే విషయం మీకు తెలుసా ?
అత్యధిక ట్యాక్స్ చెల్లించే బీటౌన్ భామ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!