మన కురులు అందంగా ఉంటే మనం అందంగా కనపడతాము. ప్రతి ఒక్కరూ కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. జుట్టు రాలిపోకుండా జుట్టు ఒత్తుగా ఎదిగితే ఎవరైనా సరే అందంగా కనపడతారు. అయితే జుట్టు రాలిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం వలన జుట్టు బాగా రాలిపోతుంది. వయసు పెరిగే కొద్దీ కూడా జుట్టు రాలిపోతుంది. కానీ మంచి ఆహారపు అలవాట్లు ఉంటే కచ్చితంగా మంచి కురులని సొంతం చేసుకోవచ్చు. శరీరంలో ఐరన్, విటమిన్ బి లోపం ఉంటే జుట్టు బాగా రాలిపోతుంది.
Advertisement
అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే చాలా మంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలియకుండా కేవలం రుచికి ప్రాధాన్యత ఇచ్చి పోషకాలని పట్టించుకోకుండా ఆహారాన్ని తీసుకుంటున్నారు. దాని వలన అనేక సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది తరచూ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడం వంటివి చేస్తున్నారు ఇలాంటి వాటి వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. పీసీఓడీ, థైరాయిడ్ ఇబ్బందులు ఉంటే కూడా జుట్టు బాగా రాలిపోతుంది.
Advertisement
జుట్టు రాలిపోకుండా ఉండాలంటే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన కూడా జుట్టు బాగా రాలిపోతుంది. జంక్ ఫుడ్ లో ఉండే సంతృప్త, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మీ యొక్క మాడుని జిడ్డు గా మారుస్తాయి రంధ్రాలని మూసుకుపోయేలా చేయడం వలన జుట్టు బాగా రాలిపోతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు బాగా హెల్ప్ అవుతాయి. గుడ్లు తో మాస్క్ వేసుకోవడం వలన జుట్టు దృఢంగా ఉంటుంది. జుట్టు రాలిపోదు. చక్కెర స్థాయిలు శరీరంలో ఇన్సులిన్ సమతుల్యతని దెబ్బతీస్తాయి. పైగా జుట్టు రాలే సమస్యని కూడా చక్కెర పెంచుతుంది. కాబట్టి పంచదారని తగ్గించుకోవడం మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా జుట్టు బాగా రాలిపోతుంది.
Also read:
- కష్టాలు తొలగిపోవాలంటే.. గరుడపురాణం లో చెప్పిన ఈ విషయాలని తప్పక పాటించండి..!
- ఈ లక్షణాలు ఉంటే.. భార్య జీవితాంతం భర్తని ప్రేమిస్తుంది..!
- Klinkara : మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార’ కొణిదెల కోసం స్పెషల్ రూమ్..వీడియో వైరల్