గరుడ పురాణానికి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు. గరుడ పురాణం గురించి కొత్తగా వివరించక్కర్లేదు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యయనాలు 19000 శ్లోకాలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. గరుడ పురాణాన్ని చదివితే మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని హిందువులు నమ్ముతారు. గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇటువంటి వాటిని పాటిస్తే కుటుంబానికి సంతోషం, శ్రేయస్సు కలుగుతుంది.
Advertisement
గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరు కూడా వారి పూర్వీకులను, వారి కులదైవాలని కచ్చితంగా పూజించాలి. కులదైవం కానీ పూర్వీకులు కానీ కోపంగా ఉంటే మనశ్శాంతి పోతుంది ప్రశాంతంగా ఉండలేరు. చాలామంది ఇంట్లో కష్టాలు ఉంటాయి దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి బాధల నుండి బయట పడాలంటే కచ్చితంగా గరుడ పురాణంలో చెప్పిన వాటిని పాటించాలి.
Advertisement
ఒకరి శక్తి మేరకు పేదలకు ఆహారాన్ని ఇవ్వడం ధాన్యాన్ని దానం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది. అలానే మనం తినే మొదటి రొట్టెని చివరి రొట్టెని కుక్కకి పెడితే చాలా పుణ్యం లభిస్తుంది. చీమలకి, చేపలకి, పక్షులకి ఆహారం నీళ్లు ఇస్తే కూడా మంచిది.
గరుడ పురాణంలో ఆవుకి ఆహారం ఇస్తే కూడా శుభం జరుగుతుందని చెప్పబడింది. ఈ విషయాలని మీరు కచ్చితంగా పాటిస్తే కష్టాలు కన్నీళ్లు ఉండవు. బాధలు అన్నీ దూరం అయిపోతాయి ఆనందంగా జీవించొచ్చు. కాబట్టి గరుడ పురాణంలో చెప్పిన ఈ నాలుగు విషయాలని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి. అప్పుడు బాధల నుండి గట్టెక్కొచ్చు ఆనందంగా ఉండొచ్చు.
Also read:
- ఈ లక్షణాలు ఉంటే.. భార్య జీవితాంతం భర్తని ప్రేమిస్తుంది..!
- Klinkara : మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార’ కొణిదెల కోసం స్పెషల్ రూమ్..వీడియో వైరల్
- వివాదంలో చిక్కుకున్న సాయి ధరమ్ తేజ్.. హారతి ఇవ్వడానికి కారణం ఎవరు ?