Home » మరోచరిత్ర మూవీ చూసిన 20 మంది అలా చేశారా ? 

మరోచరిత్ర మూవీ చూసిన 20 మంది అలా చేశారా ? 

by Anji
Ad

సినిమా అంటే చూసి ఆనందించడమే కాదు. ఈ చిత్రం నుంచి మానవులకు ఉపయోగపడే ఎన్నో కథలు ఉంటాయి. సినిమా వాళ్లను బట్టి సమాజంలో స్టైలిష్ అనేది పెరిగిపోయింది. డ్రెస్సింగ్ స్టైల్ నేర్చుకున్నారు. కొన్ని సినిమాల డైలాగులు బయటి ప్రపంచంలో కూడా చాలా మంది వాడుతుంటారు. సినిమా ఏదో రకంగా మనిషి జీవితంలో మానవ ప్రపంచంలో ఉపయోగపడుతుంటుంది. బలగం సినిమా అయితే ఎంతో మంది అన్నదమ్ములను విడిపోయిన కుటుంబాలను కలిపింది. అలాంటి మూవీ చూసి కొంతమంది చనిపోయారు. అలా మానవులపై ఎంతలా ప్రభావం చూపిన సినిమా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరిత జంటగా ప్రేమకథ బేస్ తో వచ్చిన సినిమా మరో చరిత్ర. ఈ చిత్రం అప్పట్లో చాలా థియేటర్లలో ఆడింది. ఈ మూవీ ఎండింగ్ లో ప్రేమలో విఫలమయ్యామని హీరో, హీరోయిన్స్ భావించి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇది యూత్ కి ఎంతగానో కనెక్ట్ అవుతుంది. మరి సినిమా చూసిన తరువాత చాలా మంది లవర్స్ చేసుకున్నారట. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ప్రేమలో విఫలమై ఇద్దరు కలవమని చెప్పేసి చివరి సమయంలో మరణిస్తారు. ఈ చిత్రం థియేటర్లలో చూస్తే.. మాత్రం ఎవరైనా కన్నీరు పెట్టక ఉండలేరు. 

Advertisement

అప్పట్లో యూత్ ఎంతో కనెక్ట్ అయినటువంటి ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేమ జంటలు కులం అడ్డొచ్చో లేదంటే.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకనో ఈ చిత్రం పేరునో ప్రస్తావిస్తూ.. దాదాపు 20 జంటలు లెటర్స్ రాసి మరీ మరణించారట.  ఆ తరువాత చాలా మంది మానవ హక్కుల సంఘాలు బాలచందర్ ని తిట్టారట. ఈ మూవీ 200 రోజుల ఫంక్షన్ లో సినిమా తీయడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. దయచేసి నన్ను క్షమించండి. యూత్ ని ఆకట్టుకునేలా చేసే సినిమాలు మరోసారి తీయను అంటూ బాధపడ్డాడట దర్శకుడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ కి ఎదురెళ్లి మరీ నష్టపోయిన సూపర్ స్టార్ కృష్ణ.. బరిలో దానవీర శూర కర్ణ-కురుక్షేత్రం..!

 Bangaram: బంగారం సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా?

Visitors Are Also Reading