మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది యువతీ యువకులు హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరు సక్సెస్ అయ్యి స్టార్ హీరో, హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో సెటిలైపోతారు. ఇక మరికొందరు వారు నటించిన సినిమా సక్సెస్ అయిన కూడా ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ డెబీనా బెనర్జీ కూడా ఒకరు.
Advertisement
డెబీనా బెనర్జీ అంటే ఇప్పటివారు అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ అమ్మాయిలు అబ్బాయిలు సినిమా లో హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2003లో డైరెక్టర్ రవిబాబు దర్శకత్వం యూత్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పటిలో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహిత్, విజయ్ సాయి, డెబీనా ప్రధాన పాత్రలలో నటించగా.. రవిబాబు, సోనూ సూద్, రమ్య శ్రీ, చలపతి రావు, ధర్మవరపు సుబ్రమణ్యం కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీలో డెబీనా మెయిన్ హీరోయిన్ గా నటించింది.
Advertisement
అబ్బాయిలు అమ్మాయిలు చిత్రంలో హీరో కేఫ్ లో వెయిటర్స్ గా పని చేస్తూ ఉంటాడు. రోజు ఆ కేఫ్ కి వచ్చే హీరోయిన్ అతనితో ప్రేమలో పడుతుంది. ఆ అబ్బాయికి హీరోయిన్ తన ప్రేమను ఎలా తెలియజేసిందని అంశంపై ఈ కథ నడుస్తుంది. ఈ పాత్రలో డెబీనా తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసుకుంది. ఈ మూవీతోనే డెబీనా తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ సరసన ఓమూవీ నటించింది. అయితే ఈ చిత్రం తర్వాత డేబీనాకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు జగపతిబాబు సరసన సిక్స్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీ మరియు తమిళ్ టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. 2011లో నటుడు గుర్మీత్ చౌదరిని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది. ఈమెకు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. డెబీనా ఓవైపు సీరియల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అప్పటిలో సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..!
ఆ స్టార్ హీరోయిన్ సావిత్రి మనవరాలు అనే విషయం మీకు తెలుసా ?
మరోచరిత్ర మూవీ చూసిన 20 మంది అలా చేశారా ?