వాస్తు శాస్త్రం కొన్ని నియమ నిబంధనలతో చెప్పబడింది. వీటిని పాటిస్తే జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ముందుకు సాగుతుంది. వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటె.. అవి మీ జీవితంపై గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వాస్తు ప్రకారం మనం ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటే.. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో కలబంద మొక్కని పెట్టుకోవడం గురించి కూడా వాస్తు శాస్త్రం వివరంగా చెప్పింది.
Advertisement
ఇంటి బాల్కనీ లేదా గార్డెన్‌లో కలబంద మొక్కను పెంచుకోవడం ఇంట్లోని వారికి శ్రేయస్కరం. ఆరోగ్య రీత్యా ఎన్నో లాభాలను కలిగించే కలబంద మొక్కని సరైన దిశలో పెంచుకోవడం ద్వారా వాస్తురీత్యా వచ్చే లాభాలను కూడా పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కని అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్క నాటడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి.. నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. ఆ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.
Advertisement
వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కని ఇంటి ఆగ్నేయ ప్రాంతంలో పెంచడం వలన ఆ ఇంట్లో డబ్బు రాక పెరగడంతో పాటు.. ఇంట్లోని వ్యక్తులకు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. అయితే.. కలబంద మొక్కని వాయువ్య మూల పెట్టడం మాత్రం చాలా దోషం. దీని వలన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన దిశలో కలబంద మొక్కని పెంచడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించడం అడ్డుకొనడమే కాకుండా.. శక్తీ ప్రవాహాన్ని కూడా పెంచుతుంది.
మరిన్ని…
అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?
ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?
మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్