Home » బేబీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య..! ఎందుకంటే..?

బేబీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య..! ఎందుకంటే..?

by Mounika
Ad

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ చిత్రం ఈ జూలై 14న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘‘బేబీ” సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు బరువెక్కిన హృదయంతో బయటకు వస్తారు. ఈ చిత్రం ఎప్పుడో ఒకప్పుడు ప్రేక్షకులకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కనెక్ట్ అవుతాయి. ఇలాంటి నిజజీవితంలో ఎన్నో సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి.

Advertisement

నేను మొదట యూట్యూబ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు, షార్ట్ ఫిల్మ్‌లు చేసేదాన్ని. సడెన్‌గా బేబీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నా మీద నాకు నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాయి రాజేష్‌గారు, ఎస్‌కెఎన్‌గారు నేను చేసిన షాట్స్  ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతుంటే భయపడాల్సిన పనిలేదు… నీలోని హీరోయిన్‌ని బేబీలో చూశాము. భయపడి బయటకు రా… అంటూ సాయి రాజేష్.. చాలామందిని యూట్యూబర్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల నుంచి తీసేసిన రోజులు ఉన్నాయి. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇలాంటి అవకాశం అందరికీ రాదు.. మీకు వచ్చింది. మీకు అండగా ఉంటాము అని సాయిరాజేష్ ధైర్యం చెప్పారు.

Advertisement

అమ్మనాన్న నాకు ఫస్ట్ లైఫ్ ఇస్తే.. సెకండ్ లైఫ్ ఇచ్చింది మీరు సార్ అంటూ దర్శకుడినుద్దేశించి భావోద్వేగానికి లోనయ్యింది వైష్ణవి. హీరోయిన్ అవుదామని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. కానీ హీరోయిన్ గా అవకాశాలు రావటానికి నాకు చాలా టైం పట్టింది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాను అంటూ చెప్పుకొచ్చారు వైష్ణవి చైతన్య. ఈ రోజు నేను డిఫరెంట్ లైఫ్ చూస్తున్నా అంటే మీ వల్లే సార్ . . థ్యాంక్యూ సోమచ్ సార్’అంటూ కంటతడి కంటతడి పెట్టుకుంది. ఎన్ని నెగిటివ్స్ ప్రెజర్స్ వచ్చినా..నన్ను నమ్మి, ముందుకు నడిపించారు అంటూ నిర్మాత ఎస్‌కెఎన్ ను ఉద్దేశించి కన్నీటి పర్యంతమైంది

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Takkaridonga : టక్కరి దొంగ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే?

Rambha : ఒకప్పటి తార రంభ కూతురిని చూసారా? అచ్చం తల్లిలానే.. ఎంత అందంగా ఉందో చూడండి!

సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనం ?

 

Visitors Are Also Reading