ఒకరు ఉంటే భార్య.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటారంటూ పవన్ కళ్యాణ్ కు రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారని.. వృద్ధులకు ఒకటో తేదీనే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నాడని మండిపడ్డారు.
Advertisement
చంద్రబాబు జన్మభూమి కమిటీలు పచ్చజెండా కట్టుకుంటే కానీ పథకాలు అందించే వారు కాదు.. లంచం ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు పని చేసేవి కావన్నారు. నమస్కారానికి కూడా సంస్కారం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని..వాలంటీర్లు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రుచి చూశాడని చురకలు అంటించారు. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ రాజ్యాంగేతర శక్తా?? పవన్ కళ్యాణ్ కు ఎంత మంది పిల్లలు ఉన్నారని ప్రశ్నించారు.
Advertisement
ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్ళాలు అనే అంటారన్నారు. నీ రెండో సహధర్మచారి రేణూ దేశాయ్ నే స్వయంగా మీడియా ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయితో భర్త పిల్లలను కంటే ఎలా ఉంటుందో మీరే ఆ స్థానంలో ఉండి ఆలోచించండి అని చెప్పిన విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతా చూసిందని చెప్పారు. ఒట్టి కుండ శబ్దం చేస్తుంది…నిండు కుండ తొణకదన్నారు రాజమండ్రి ఎంపి మార్గాని భరత్.
ఇవి కూడా చదవండి
అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?
ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?
మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్