సూపర్ స్టార్ రజినీ కాంత్ , ఎలాంటి ఉపమానాలు అక్కర్లేని నటుడతను, తనదైన స్టైల్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను సంపాధించుకున్న రజినీ కాంత్ తెలుగులో మొదటగా ‘అంతులేని కథ’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో జయప్రదకు అన్నగా మూర్తి అనే పాత్రలో నటించాడు.
Also Read: లయన్ తో లైగర్ టీమ్.. ఫొటోలు వైరల్..!
Advertisement
ఈ పాత్ర బాగా తాగుడు అలవాటున్న పాత్ర, పైగా ఎలాంటి పనిపాటలేకుండా తిరిగేవాడు. చెల్లెల్లి సంపాధన మీద ఆధారపడి బ్రతికేవాడు. అలాంటి మూర్తి ఓ బలమైన సంఘటన కారణంగా పరివర్తన చెంది పనిచేసి బతకాలని నిర్ణయించుకుంటాడు. ఈ పాత్రలో నటించినందుకు గాను రజినీకాంత్ కు 1000 రూపాలయ రెమ్యునరేషన్ ఇచ్చారు.
Advertisement
ఈ సినిమాలో కమల్ హాసన్, జయప్రదలతో కలిసి నటించాడు రజినీ. “దేవుడే ఇచ్చాడు వీథి ఒకటి” అనే పాటలో రజినీ ఫర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాలి. 1976లో రిలీజైన ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది రజినీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో రజినీకి ఇదే తొలి సినిమా. దీని కంటే ముందు తమిళ్ లో ఆపూర్వ రాగంగళ్ , కన్నడలో కథ సంగమ అనే సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు.
Also Read: సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు… వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!