Home » లయన్ తో లైగర్ టీమ్‌.. ఫొటోలు వైర‌ల్‌..!

లయన్ తో లైగర్ టీమ్‌.. ఫొటోలు వైర‌ల్‌..!

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఆహాలో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న పాపుల‌ర్ షో అన్‌స్టాప‌బుల్. ఈ మ‌ధ్య కాలంలో ఈ షో ఎంతో పాపుల‌ర్ అయింది. ఇక ఈ షోకు ల‌య‌న్‌తో లైగ‌ర్ టీమ్ రాక‌కు ముహుర్తం ఖ‌రారు అయింది. ఇప్ప‌టికే లైగ‌ర్ టీమ్ పాల్గొన‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పాటు పూరిజ‌గ‌న్నాథ్‌, చార్మి కూడా క‌నిపించ‌బోతున్నారు. ఈ ఎపిసోడ్ తేదీని మేక‌ర్స్ ఫిక్స్ చేశారు. త్వ‌ర‌లోనే ప్రోమో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

Image

Advertisement

విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ విడుద‌ల చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతూ ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ అవుట్ ఫిట్, స్టైల్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. బాల‌య్య ప‌క్కా తెలుగు లుక్‌లో పంచె క‌ట్టుతో ఆక‌ట్టుకుంటున్నారు. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకేలో ప్ర‌త్యేక ఎపిసోడ్ సంక్రాంతి స్పెష‌ల్ ఎపిసోడ్గా జ‌న‌వ‌రి 14న ఆహాలో ప్రసారం కానున్న‌ది.

Advertisement

Image

ఇటీవ‌లే అఖండ‌తో బాల‌య్య మంచి హిట్‌ను సాధించ‌గా.. ఇప్పుడు గోపిచంద్ మ‌లినేని ప్రాజెక్ట్‌తో బీజీగా ఉన్నారు. మ‌రొక వైపు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా షూటింగ్ కార‌ణంగా మ‌రొక‌సారి ఆగిపోయింది. తెలుగు, హిందీలో ఏక‌కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అన‌న్య‌పాండే న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్‌రాయ్ స‌హాయ‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహ‌ర్, పూరిజగ‌న్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య లైగ‌ర్ ఆగ‌స్టు 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Visitors Are Also Reading