ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని.. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. జగనన్న సురక్షా క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని.. ఈ కార్యక్రమం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం పై కూడా మీ పర్యవేక్షణ ఉండాలని.. మంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు సిఎం జగన్.
Advertisement
సొంత జిల్లాల్లోనే కాకుండా ఇంఛార్జ్ జిల్లాల్లోనూ మంత్రుల పర్యటనలు, పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఇక జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18న జగనన్న తోడు, ఈ నెల 20న సీఆర్డీయే ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. ఈ నెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేయనుంది జగన్ ప్రభుత్వం.
Advertisement
ఈనెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేయనున్నామని.. ఈ నెల 28న జగనన్న విదేశీ విద్య ఉంటుందన్నారు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. భూమి లేని నిరుపేదలకు అసైన్ భూముల పై కీలక నిర్ణయం తీసుకున్నామని.. వీటి పై ఉన్న ఆంక్షలు తొలిగించి 54 వేల ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామన్నారు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. లంక భూములు కూడా కలిపితే సుమారు 63 వేల ఎకరాల భూమి పై 66 వేల మందికి పూర్తి హక్కులు దక్కనున్నాయని.. 20 ఏళ్ళ పాటు అసైన్డ్ భూమిని అనుభవిస్తున్న వారికి ఈ ప్రయోజనం దక్కుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Ys Sharmila : వైఎస్ షర్మిల కొడుకు హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే?
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్
MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?