Home » కుక్క పుట్టిన రోజుకు 7లక్షలు…యజమానిని బొక్కలో వేసిన పోలీసులు…!

కుక్క పుట్టిన రోజుకు 7లక్షలు…యజమానిని బొక్కలో వేసిన పోలీసులు…!

by AJAY
Ad

సాధారణంగా పుట్టినరోజు వేడుకలు ఎక్కువగా చిన్నపిల్లలకు చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు అయితే ఏజ్ పెరిగినా కూడా జరుపుకుంటారు. కానీ సామాన్యులు పుట్టిన రోజు వేడుకల పై పెద్దగా ఆసక్తి చూపరు. ఒకవేళ పుట్టిన రోజు జరుపుకున్నా మహా అయితే వేళల్లో ఖర్చు చేస్తారు. కానీ ఇక్కడ ఓ పెంపుడు కుక్క పుట్టిన రోజు కోసం అక్షరాలా ఏడు లక్షలు ఖర్చు చేశారు. కుక్క పుట్టినరోజు కోసం ఓ భారీ ఫంక్షన్ హాల్ ను బుక్ చేసుకున్నారు.

Ahmadabad dog birthday

Ahmadabad dog birthday

బంధువులను స్నేహితులను పెద్ద మొత్తంలో ఆహ్వానించారు. దానికి తగినట్టుగానే డాన్స్ షో… పాటల ప్రోగ్రాం ఇతర వినోద కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ వింత వేడుక జరిగింది కూడా ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశం లోని గుజరాత్ రాష్ట్రం లోనే.. ఈ బర్త్ డే ఫంక్షన్ జరిగింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన కృష్ణా నగర్ కాలనీలోని సోదరులు చిరాక్ పటేల్, ఊర్విష్ పటేల్ తమ పెంపుడు కుక్క అభి పుట్టినరోజును 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు.

Advertisement

Advertisement

Also read : స‌మంత సాంగ్‌కు డాన్సింగ్ డాడ్ స్టెప్పులు..!

ఇక ఈ పుట్టినరోజు వేడుకకు భారీ ఎత్తున బంధువులు, స్నేహితులు విచ్చేసి కుక్కను ఆశీర్వదించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ప్రస్తుతం గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. దాంతో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు జరిపారని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు… డబ్బులు ఎక్కువ అయితే ఇలాంటి రోగాలే వస్తాయి.. అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading