Home » స‌మంత సాంగ్‌కు డాన్సింగ్ డాడ్ స్టెప్పులు..!

స‌మంత సాంగ్‌కు డాన్సింగ్ డాడ్ స్టెప్పులు..!

by Anji

నాగ‌చైత‌న్య, స‌మంత దంప‌తులు విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత త‌న‌దైన శైలిలో దూసుకెళ్లుతున్నారు. ప్ర‌స్తుతం పుష్ప‌ మేనియా కొన‌సాగుతున్న‌ది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప సూప‌ర్ హిట్ అందుకున్న‌ది. ద‌క్షిణాదిలోనే కాకుండా ఉత్త‌రాదిలో పుష్ప క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. ఊరా మాస్ లుక్‌లో బ‌న్నీ న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అయ్యారు. పుష్ప మూవీ మాత్ర‌మే కాదు.. ఇందులో పాట‌లు ఇప్ప‌టికీ యూట్యూబ్ షేక్ చేస్తూ ఉన్నాయి. ఇక స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా..ఉఊ అంటావా మామ అంటూ సాగే ఈ పాట‌లో స‌మంత అదిరిపోయే స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంటున్న‌ది.

Viral Video: సమంత స్పెషల్ సాంగ్‏కు డాన్సింగ్ డాడ్ స్టెప్పులు.. వీడియో అదుర్స్..

దేవీశ్రీ సంగీతం అందించిన ఈ సినిమాలో స‌మంత పాట హైలెట్‌గా నిలిచింద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా సుకుమార్ సినిమా అంటేనే అందులో ప్రత్యేకంగా ఒక ఐటం సాంగ్ త‌ప్ప‌కుండా ఉంటుంది. మ‌ళ్లీ అది హిట్ సాంగే ఉండ‌డం విశేషం. చంద్ర‌బోష్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను ఫోక్ సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహ‌న్ మ‌త్తు ఎక్కించే వాయిస్‌తో మొస్మ‌రైజ్ చేసింది. ఈ సాంగ్ సోష‌ల్ మీడిలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ పాట‌కు అమెరికాకు చెందిన రికీ పాండ్ త‌న‌దైన స్లైల్‌లో డ్యాన్ చేసాడు.

Samantha Ruth Prabhu's first item song 'O Antava' in Pushpa slammed by  netizens. Here's why | Entertainment News – India TV

రికీ పాండ్ భారతీయ పాట‌ల‌కు నిత్యం చేస్తూ ఉంటారు. త‌న కుటుంబంతో క‌లిసి ఇండియ‌న్ సాంగ్‌కు డాన్స్ చేస్తూ ఆ వీడియోల‌ను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా స‌మంత సాంగ్‌కు స్టెప్పులేసి అదుర్స్ అనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా షేర్ చేశాడు. అల్లుఅర్జున్‌, స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న, మైత్రిమూవీ అఫిషియ‌ల్స్ కొరియోగ్రాఫ‌ర్ పొల‌కి విజ‌య్‌ల‌కు ట్యాగ్ చేసాడు. నెటిజ‌న్స్ అత‌ని డాన్స్ చూసి మైండ్ బ్లోయింట్ అని కామెంట్ చేస్తున్నారు.


You may also like