Home » ఈ లక్షణాలు ఉన్న వారు పాలు అస్సలు తాగకండి.. తాగితే అంతే సంగతులు..!

ఈ లక్షణాలు ఉన్న వారు పాలు అస్సలు తాగకండి.. తాగితే అంతే సంగతులు..!

by Anji
Ad

సాధారణంగా పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు తాగకపోవడం చాలా మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. చాలా హెల్దీగా ఉన్నామనుకునే వారు కొంత మందికి చాలా  డేంజర్. కొంతమందికి పాలు తాగితే వెంటనే స్కిన్ అంతా ర్యాషెస్ వస్తాయి. కొంతమందికి కడుపునొప్పి ఇలా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. 

Advertisement

సంపూర్ణ ఆహారం, పాలలో మన శరీరానికి పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలలో ప్రోటీన్లు, విటమిన్ ఏ, బీ1, బీ2, బీ12, బీ6, డీ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, పాస్పరస్ పాంథోనిక్ యాసిడ్, సెలినియమ్, నియాసిన్ లాంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రతీరోజూ పాలు తాగితే.. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పాలు తాగితే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. జీర్ణక్రియ చాలా మెరుగ్గా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. చర్మం, జుట్టు, హెల్తీగా ఉంటాయి. రోజూ పాలు తాగితే.. మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు పాలు తాగితే ప్రమాదకరం. పాలు ఎవ్వరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారు పాలు తాగకూడదు. లివర్ లో కొవ్వు పేరుకుపోవడానికి ప్యాటీ లివర్ అంటారు. లివర్ లో కొవ్వు పేరుకుపోయి.. ఇన్ఫ్ల మేషన్ కి దారి తీస్తుంది. ఫ్యాటీ లివర్ పేషెంట్స్ పాలు తాగితే.. వారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. లాక్టోస్ పడని వాళ్లు ఈ లాక్టోస్ ఇన్ టోలరెన్స్ ఉన్నవారు పాలు తాగకూడదు. ఒకవేళ తాగితే మరణించే ప్రమాదం ఉంది. చిన్నప్రేగు తగినంత లాక్టేజ్ ఉత్పత్తి చేయకపోతే లాక్టోస్ అసహనం వచ్చే అవకాశం ఉంది. ఇది పాలలో చక్కరను జీర్ణం చేయడానికి ఓ ఎంజైమ్. పాలు తాగిన 32 గంటల తరువాత మీకు ఏదైనా కడుపులో అసౌకర్యం ఉంటే లాక్టోస్ ఇంటోలరెన్స్ ని నిర్థారించుకోండి. పాలు తాగిన తరువాత కడుపు ఉబ్బరం, ఎసిడిటి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురు అయితే వాళ్లు పాలు తాగకూడదు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురైతే పాలు తాగకూడదు.

చాలా మందికి పాలు తాగిన తరువాత కడుపులో తిప్పడం, ఇబ్బందిగా ఉండటం, వికారంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది వ్యక్తులు పాలు తాగిన తరువాత భయపడుతూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు పాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ ఉన్న వారు పాలు తాగకూడదు. తాగినట్టయితే వారికి పాలు అరగడం చాలా కష్టం. పాలు తాగిన తరువాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది,వాంతులు, మలం నుంచి రక్తం వస్తుంటే.. పాలు తాగకూడదు. ఈ లక్షణాలకు అర్థం మీకు మిల్క్ అలర్జీ ఉన్నట్టు లెక్క. ఇలాంటి వ్యక్తులు పాలు అస్సలు తాగకూడదు. గుండె సమస్యలున్నవారు పాలు అస్సలు తాగకూడదు. వాస్తవానికి పెద్దవారు పాలు తాగకపోవడమే చాలా మంచిది. మీకు ఏమైనా చర్మవ్యాధులు ఉంటే పాలు తాగడం వల్ల చర్మంపై మచ్చలు, ముడతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వారు దూరంగా ఉండటం చాలా మంచిది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కేసీఆర్ సర్కార్ పై ఫారీయ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు !

ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!

Visitors Are Also Reading