Home » ఆసియా కప్ మ్యాచ్ లు జరిగే వేదికలు ఇవే.. భారత్-పాక్ మ్యాచ్ అక్కడేనా..? 

ఆసియా కప్ మ్యాచ్ లు జరిగే వేదికలు ఇవే.. భారత్-పాక్ మ్యాచ్ అక్కడేనా..? 

by Anji
Ad

సాధారణంగా ఎక్కడైనా  ఆసియా కప్, ప్రపంచ కప్ జరుగుతుందంటే ముందుగానే షెడ్యూల్ ని ప్రకటిస్తారు. కానీ  ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ టోర్నమెంట్ ని నిర్వహించడంలో బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ ని సూచించింది. ఈ నమూనా ప్రకారం.. పాకిస్తాన్ టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చేది. భారత జట్టు ప్రకారం.. తటస్థ వేదికలపై ఆడనుంది. తాజాగా పాకిస్తాన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీమిండియా పాకిస్తాన్ లో ఆడాల్సిందేనని పాక్ క్రికెట్ బోర్డు కొత్తగా పట్టుబడుతోంది. 

Advertisement

ఆసియా కప్ నకు ఆతిథ్యం ఇచ్చే దేశం పాకిస్తాన్ కాబట్టి.. టోర్నీలోని అన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ లోనే జరగాలని పీసీబీ వాదిస్తోంది. పాకిస్తాన్ లోని లాహోర్ లో, శ్రీలంకలోని క్యాండీలో ఆసియా కప్ మ్యాచ్ లు జరుగుతాయని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తమ మ్యాచ్ లను క్యాండీలో ఆడనుంది. అయితే భారత్-పాక్ మ్యాచ్ కూడా క్యాండీలో జరుగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టోర్నమెంట్ లో శ్రీలంక 7 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. 

Advertisement

 

 

పాకిస్తాన్ లో 4 మ్యాచ్ లు జరుగనున్నాయి. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇటీవల పాకిస్తాన్ క్రీడా మంత్రి అహ్సాన్ మజారీ మీడియాతో మాట్లాడుతూ.. ఆసియా కప్ 2023కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నందున టోర్నమెంట్ లోని అన్నీ మ్యాచ్ లు పాకిస్తాన్ గడ్డపై ఆడాలని పేర్కొన్నారు.  తనకు హైబ్రిడ్ మోడల్ అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ కి రాకపోతే.. పాకిస్తాన్ జట్టు వన్డే ప్రపంచకప్ ఆడేందుకు భారత్ కి వెళ్లదంటూ ప్రకటించడం గమనార్హం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తొలి టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు..? అతనికి మరో ఛాన్స్ దక్కేనా ?

నాడు తండ్రితో.. నేడు కొడుకుతో తలపడేందుకు సిద్ధమైన విరాట్.. అరుదైన లిస్టులో ఎవరున్నారో తెలుసా?

Visitors Are Also Reading