తండ్రి బతికుండగా కొడుకు మరణించడం అనేది ఎంతో విషాదకరం. తన చేతులతో పెంచిన తండ్రికి కొడుకు మరణం తీరని శోకాన్ని మిగిలిస్తుంది. అలా మన టాలీవుడ్ లోనూ కొంతమందికి పుత్రశోకం తప్పలేదు. వారిలో ఇప్పటికీ చాలామంది తమ కొడుకులను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అలా కొడుకులను కోల్పోయిన తండ్రులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కృష్ణ
రీసెంట్ గా కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కొడుకు మరణం కృష్ణ ను తీవ్రంగా కలచివేసింది.
కోట శ్రీనివాసరావు&బాబు మోహన్
కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొడుకును తలుచుకుని కోట బాధపడుతూ ఉంటారు. కోటకు ఒకే కుమారుడు ఉండగా అతడు కూడా మరణించడం తో కోటా ఎంతో కుమిలిపోతూ ఉంటారు. బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పటికీ బాబు మోహన్ కొడుకు ను తలుచుకుని బాధ పడుతూ ఉంటారు.
నందమూరి హరికృష్ణ
Advertisement
నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో హరికృష్ణ తీవ్ర ఆందోళన చెందారు. కొంత కాలానికి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం.
దర్శకుడు తేజ
తేజ కుమారుడు కూడా చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయాడు. కేవలం ఆరేళ్ళ వయసులోనే తేజ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడిని బ్రతికించు కునేందుకు తేజ ఎన్నో డబ్బులు ఖర్చు చేశాడు. కొంతకాలం పాటు ఆ డిప్రెషన్ తోనే తేజ సినిమాలకు సైతం దూరమయ్యాడు.
ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ మొదటి భార్యకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిలో కుమారుడు చిన్న వయసులోనే మరణించాడు. అనారోగ్యంతో కుమారుడు మరణించడంతో ప్రకాష్ రాజ్ ఎంతో ఆవేదన చెందాడు.
ప్రభుదేవ
ప్రభుదేవకు సైతం పుత్రశోకం తప్పలేదు. ప్రభుదేవ కుమారుడు సైతం చిన్న వయసులోనే మరణించాడు. కుమారుడి మరణం తర్వాత భార్యతో గొడవలు జరగడం వల్ల ప్రభుదేవ ఆమె నుండి విడిపోయాడు.
Also read : హనుమాన్ జంక్షన్ కోసం ముందుగా మోహన్ బాబు, రాజశేఖర్ లకు అడ్వాన్స్ ఇచ్చారు.. కానీ…!