Telugu News » Blog » హనుమాన్ జంక్షన్ కోసం ముందుగా మోహన్ బాబు, రాజశేఖర్ లకు అడ్వాన్స్ ఇచ్చారు.. కానీ…!

హనుమాన్ జంక్షన్ కోసం ముందుగా మోహన్ బాబు, రాజశేఖర్ లకు అడ్వాన్స్ ఇచ్చారు.. కానీ…!

by AJAY
Ads

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మోహన్ రాజా 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో హనుమాన్ జంక్షన్ అనే మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో జగపతి బాబు, అర్జున్ హీరోలుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్ రాజా ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

Advertisement

ఈ సినిమా కోసం మొదటగా అర్జున్, జగపతి బాబు లను హీరోలుగా పెట్టాలని అనుకోలేదు అని చెప్పారు. తను ఈ సినిమాలో ముందుగా మోహన్ బాబు మరియు రాజశేఖర్ లను హీరోలుగా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ మంచి డెడికేషన్ ఉన్న హీరోలు అని అంతేకాకుండా స్టార్డమ్ ఉన్న హీరోలు ఇద్దర్నీ తాను మెయింటెన్ చేయగలనా అని సందిగ్ధంలో పడిపోయినట్టు పేర్కొన్నారు.

Advertisement

దాంతో ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన మోహన్ రాజా తండ్రి మోహన్ ఈ సినిమాలో హీరోలుగా అర్జున్ మరియు జగపతి బాబు లను ఫిక్స్ చేశారట. అలా తన తండ్రి వల్ల ఈ సినిమాలో జగపతి బాబు అర్జున్ హీరోగా చేశారని మోహన్ రాజా వెల్లడించారు. ఇదిలా ఉంటే మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ తో తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మాస్ ఓరియెంటెడ్ గా రాబోతోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాన్ని మోహన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

 

Advertisement

Also read : బండ్ల గణేష్ కు మూడో సారి కరోనా పాజిటివ్…!

You may also like