Home » మీ ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీ దేవి తాండవం చేస్తుంది…!

మీ ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీ దేవి తాండవం చేస్తుంది…!

by Bunty
Ad

ప్రతి ఒక్కరు ఇల్లును కట్టేటప్పుడు వాస్తును తప్పకుండా చూస్తారు. వాస్తును చూసి వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. ఇల్లు ఏ దిక్కున ఉండాలి… ఎన్ని కిటికీలు ఉండాలి… ఎన్ని తలుపులు ఉండాలి…. ఏ వైపు ఉంటే మంచిది అనేది కూడా వాస్తు ప్రకారం చూసుకుని ఆ తర్వాత వాటిని పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంటిని కడతారు. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనే విషయాన్ని తప్పకుండా చూసుకుంటారు.

Advertisement

వాస్తుశాస్త్రం ప్రకారం దేవుని గది ఈశాన్యం వైపుకు ఉండాలి. వంటగది ఆగ్నేయం వైపు ఉండాలి. బెడ్ రూమ్ నైరుతి వైపుకు ఉండాలి. ఇలా కనుక ఖచ్చితంగా ఉంటే పడమర వైపు ముఖద్వారం ఉండాలి. ఇలా పడమర వైపు ఇల్లు ఉంటే ఎంతో శ్రేష్టం. ఇలా కనక ఇంటిని నిర్మిస్తే ముందు సిట్టింగ్ రూమ్ వస్తుంది. ఆ తర్వాత హాల్ వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కడితే ఏ గదికి ఆదే ఉంటుంది తప్ప ఓ గదికి ఓ గదికి మధ్య సంబంధం అనేది ఉండదు. గదులు చాలా చక్కగా ఉండడంతో పాటుగా వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకనే పడమర దిక్కు ఫేసింగ్ ఉండడం చాలా మంచిది. ఎంతో బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా స్థలం కొన్నప్పుడు లేదా ఇల్లు కొన్న కూడా మొదట ఎలా ఫేసింగ్ ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ ఉండేటట్టు ప్రిఫర్ చేయండి.

Advertisement

ఇలా చేస్తే ఎంతో శ్రేష్టం. వెస్ట్ ఫేసింగ్ కనుక మీకు కలిసి వస్తుందని పండితులు చెప్పినట్లయితే కచ్చితంగా అలానే ఇంటిని నిర్మించుకోవాలి. వెస్ట్ సైడ్ ఫేసింగ్ వలన మీకు మొత్తం కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు దైవాన్ని కొలవడం, మీ పనులు మీరు చేసుకోవడం, చక్కటి మార్గంలో సంపాదించుకోవడం వంటివి చేస్తూ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఇలా వాస్తుప్రకారం ప్రతి ఒక్కదాన్ని నిర్మించుకోవడం వల్ల ఇంట్లో అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ జీవితంలో వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటించాలి.

ఇవి కూడా చదవండి

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

Visitors Are Also Reading