టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా కు వికెట్ కీపర్ గా ఎంట్రీ ఇచ్చి… ఆ తర్వాత కెప్టెన్ గా తన కెరీర్ ను ముగించాడు. టీమిండియా కు ఏకంగా మూడు ఐసీసీ టోర్నమెంట్లను అందించాడు మహేంద్ర సింగ్ ధోని. 2004 సంవత్సరంలో టీమిండియాలో వికెట్ కీపర్‌గా వచ్చిన ధోని.. 2020 సమయంలో రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉంటున్నాడు ధోని. అంతేకాదు ఇప్పటికే.. సూపర్ కింగ్స్ జట్టుకు 5 టోర్నీలు అందించాడు మహేంద్రసింగ్ ధోని.
Advertisement
ఇది ఇలా ఉండగా, టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలను మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ చెప్పారు. ‘2005 సమయంలో నేను ధోని ఎక్కువగా కలిసేవాళ్లమని చెప్పాడు. అప్పుడు ధోని నా భార్య అయ్యేషాతో ఎక్కువగా మాట్లాడేవాడు. తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి రూ.30 లక్షలు సంపాదించాలనుకుంటున్నానని, రాంచీని కూడా వదిలి వెళ్లడం ఇష్టం లేదని ఆమెతో ధోని తన కోరిక చెప్పేవాడు’ అని జాఫర్ తెలిపారు.
Advertisement
అంటే.. ధోని క్రికెట్ లోకి కేవలం రూ. 30 లక్షలు సంపాదించుకోవడానికి వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని పుట్టినరోజును దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల ఓ థియేటర్ వద్ద 52 అడుగుల కటౌట్, AP నందిగామలో 77 అడుగుల పొడవు ఉన్న ధోని కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలను ధోని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Tamim Iqbal : ప్రధాని వార్నింగ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్ !
Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!
Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు