Home » శుక్రవారం నాడు మాత్రం అస్సలు ఈ పొరపాట్లని చెయ్యకండి.. డబ్బులన్నీ పోతాయి..!

శుక్రవారం నాడు మాత్రం అస్సలు ఈ పొరపాట్లని చెయ్యకండి.. డబ్బులన్నీ పోతాయి..!

by Sravya
Ad

శుక్రవారం నాడు అసలు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ఇలాంటి తప్పులు కనుక చేశారంటే డబ్బులని నష్టపోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. శుక్రవారం నాడు మహిళలు అమ్మవారని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు కూడా. స్త్రీలకు సంబంధించిన రోజు శుక్రవారం కనుక ఆ రోజు కొన్ని పనులు చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. శుక్రవారం పూట అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన మంచి జరుగుతుంది.

Advertisement

అదేవిధంగా తులసి మొక్కకి పూజ చేయడం, మహాలక్ష్మి దేవిని పూజించడం కూడా చాలా ముఖ్యం. ప్రతి శుక్రవారం కూడా గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టాలి. పచ్చని గడప చూసి లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుందట. కాబట్టి కచ్చితంగా మహిళలు శుక్రవారం పూట ఈ విషయాన్ని తప్పక పాటించాలి. శుక్రవారం నాడు షేవింగ్ చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటివి తప్పు. ఆ రోజు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.

Advertisement

శుక్రవారం నాడు మహిళలు బాధపడకూడదు. కంటతడి పెట్టకూడదు. ఎక్కడైతే ఆడవాళ్లు నవ్వుతూ కళకళల్లాడుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. శుక్రవారం నాడు ఈశాన్యం వైపు చీపురు కట్టని అసలు పెట్టకూడదు. పాత బట్టల ని ఎవరికీ దానం చేయకూడదు. శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపం పెడితే ఎంతో మంచి జరుగుతుంది.

మాసిపోయిన బట్టలు వేసుకోవడం కూడా అసలు మంచిది కాదు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి స్తోత్రం చదివితే చాలా మంచి జరుగుతుంది. దానధర్మాలు చేస్తే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అదేవిధంగా శుక్రవారం నాడు ఎరుపు, ఆకుపచ్చ బట్టలు వేసుకుంటే అదృష్టం కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. సంపద పెరుగుతుంది. ధన నష్టం వంటి ఇబ్బందులు వుండవు.

Also read:

Visitors Are Also Reading