సాధారణంగా సినిమాలకు హీరో, హీరోయిన్లు ఏవిధంగా ఉంటారో కమెడియన్లు కూడా అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమెడీయన్లలో బ్రహ్మానందం ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. బ్రహ్మానందం తరువాతనే ఎవరైనా..? అలా కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం లాంటి ప్లేస్ ని భర్తీ చేసినటువంటి కమెడియన్ యోగిబాబు. కామెడీ గురించి చెప్పాల్సిన అవసరము లేదు. ఈయన తెలుగు డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇంకా తమిళ ఇండస్ట్రీలో యోగిబాబు కామెడీ లేనిదే సినిమాలు లేవనే స్థితిలో ఉంటుంది. అలాంటి యోగిబాబు ఒక్కో సినిమాకు పారితోషికం ఎంత తీసుకుంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కమెడీయన్ యోగిబాబు 2009లో విడుదలైన కోలీవుడ్ మూవీ యోగి చిత్రం ద్వారా ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయనను అందరూ యోగిబాబు అని పిలవడం ప్రారంభించారు. ఎన్నో సినిమాల్లో నటించి ఆడియెన్స్ ని అలరించారు. స్పెషల్ ఆయన కోసమే స్టోరీలో కొన్ని కామెడీ ట్రాక్ రాస్తుంటారు. యోగిబాబు నటించిన చాలా సినిమాలుకూడా తెలుగులో డబ్ అయ్యాయి. ఆ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాడు. ఇటీవల కాలంలో లవ్ టుడే సినిమాలో యోగిబాబు పండించిన కామెడీ ఆడియెన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. వారసుడు, కోస్టి వంటి సినిమాల్లో నటించారు.
Advertisement
ఇటీవల విడుదలైన విజయ్ ఆంటోని బిచ్చగాడు 2లో బిచ్చగాడు క్యారెక్టర్ లో నటించి ఆడియెన్స్ నవ్వించాడు. ప్రస్తుతం యోగిబాబు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కొంత మంది చిన్నహీరోలు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా పారితోషికంగా తీసుకుంటారట. ఈయన పారితోషికం రోజువారిగానే ఉంటుందట. ఒక్కోరోజు రూ.18లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. 20 రోజుల షూటింగ్ ఉన్నట్టయితే నాలుగు కోట్లకు పైగానే అమౌంట్ అందుకుంటారట. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి స్టార్ కమెడీయన్లలో యోగిబాబు కూడా ఉంటారు. కమెడీయన్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు యోగిబాబు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
టీమిండియా సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా? ప్రధాని కంటే ఎక్కువ!
చైతన్య-నిహారిక విడాకులు తీసుకోవడానికి పెద్దవారు చేసిన ఆ తప్పే కారణమా ?
పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ తో బయ్యర్స్ ఎంత లాభమో తెలుసా ?