Home » ధోనీ ‘కెప్టెన్‌ కూల్‌’ కాదు.. బూతులు తిడతాడు – ఇషాంత్ శర్మ

ధోనీ ‘కెప్టెన్‌ కూల్‌’ కాదు.. బూతులు తిడతాడు – ఇషాంత్ శర్మ

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఏకంగా మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఘనత ధోని పేరున ఉంది. 2007 సంవత్సరంలో టి20 వరల్డ్ కప్, 2010 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ అలాగే 2013 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీని… టీమిండియా కు అందించి చరిత్ర సృష్టించాడు మహేంద్ర సింగ్ ధోని. వికెట్ల వెనుక ప్రశాంతంగా ఉంటూ… టీమిండియా కు అనేక విజయాలు అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ధోని పేరుట రికార్డు ఉంది.

Advertisement

అయితే అలాంటి మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని పై టీమ్ ఇండియా బౌలర్ ఇషాంత్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహేంద్రసింగ్ ధోని పైకి కనిపించేంత మిస్టర్ కూల్ కాదని… చాలా కోపస్తుడంటూ ఫైర్ అయ్యాడు ఇశాంత్ శర్మ. ధోని కెప్టెన్సీలో… తనకు ఎదురైన ఓ ఘటన గురించి తాజాగా ఓపెన్ అయ్యాడు ఇషాంత్ శర్మ. అయితే ధోనీతో ఎదురైన ఓ సంఘటనను ఇషాంత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. నేను ఒకరోజు బౌలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బాగా అలసిపోయాను… అప్పుడు నన్ను చూసి బాగా అలసిపోయావా ? అని ధోని అడిగాడు.

Advertisement

అవును ధోని భాయ్ నేను అలిసిపోయాను అని చెప్పినట్లు ఇశాంత్ శర్మ వెల్లడించారు. అయితే నీకు వయసు అయిపోయింది.. రిటైర్మెంట్ తీసుకో అంటూ ధోని వ్యంగ్యంగా మాట్లాడినట్లు ఈశాంత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. అలాగే మరో సంఘటనను గుర్తు చేసుకుంటూ…ఒకసారి మహేంద్ర సింగ్ ధోని విసిరిన త్రో నేను అందుకోలేకపోయాను… దీంతో మరోసారి బలంగా త్రో విసిరాడు. అప్పుడు కూడా నేను పట్టుకోలేక పోయాను.. మూడో త్రో వేసేటప్పుడు తల బాదుకో అని గట్టిగా అరిచాడు అంటూ ధోని కోపాన్ని గురించి ఇషాంత్ శర్మ తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

 

ఇవి కూడా చదవండి

WI VS IND TOUR : కెప్టెన్‌గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Praveen Kumar : టీమిండియా బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కారుకు ప్ర‌మాదం

Visitors Are Also Reading