ప్రస్తుతం వెండితెర, బుల్లితెర అనే తేడా తగ్గిందనే చెప్పచ్చు. ఎందుకంటే అవకాశాలు వస్తుంటే టాలెంట్ నిరూపించుకోవడానికి, పాపులారిటీ పెంచుకోవడానికి, నాలుగు రూపాయలు వెనకేసుకోవడానికి కూడా బుల్లితెర వేదికగా మారుతోంది. సినిమాల్లో నటించే హీరోయిన్స్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ ఫాలోయర్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. ఈ క్రమంలో సీరియల్ హీరోయిన్స్ కి కూడా పాపులారిటీ పెరుగుతోంది. వారి పారితోషికాలు కూడా ఎక్కువే ఉంటున్నాయి. కొందరు సీరియల్ హీరోయిన్స్ సినిమా హీరోయిన్స్ కంటే ఎక్కువే తీసుకుంటున్నారు. వారి లిస్ట్ పై ఓ లుక్ వేసేయండి.
Advertisement
1. ఐశ్వర్య:
కస్తూరి సీరియల్తో పాపులర్ అయిన నటి ఐశ్వర్య సింగల్ డే కాల్ షీట్ కోసం ఇరవై వేల రూపాయలను ఛార్జ్ చేస్తారు. అంటే నెలకు కనీసం ఆరు లక్షల రూపాయలను ఆమె ఛార్జ్ చేస్తారు. ఒక సీరియల్ కనీసం రెండు సంవత్సరాల పాటు ఉంటె లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఆమె ఆదాయం కోట్లలోనే ఉంటుంది.
2. సుహాసిని:
బాలాదిత్య హీరోగా నటించిన చంటిగాడు (2003) సినిమాతో సుహాసిని వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తన ట్రెడిషనల్, క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెర వైపు వచ్చింది. ప్రస్తుతం ఆమె రోజుకు ఇరవై వేల రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు.
Advertisement
3. పల్లవి రామిశెట్టి:
సీరియల్స్ లో ఎక్కువగా డీసెంట్ రోల్స్ లో నటించే పల్లవి రామిశెట్టి కూడా మంచి నటి. ఆమె రోజుకు 15 వేల రూపాయలను ఛార్జ్ చేస్తారు.
4. నవ్య స్వామి:
ఈటీవీ, మాటీవీ, జీటీవీ ఛానెల్స్ లలో పాపులర్ సీరియల్స్ లో నటించి అలరించే నవ్య స్వామి సింగల్ డే కాల్ షీట్ కోసం ముప్పై ఐదు వేల రూపాయలను ఛార్జ్ చేస్తారు. అంటే ఆమె నెలకు పది లక్షలకు పైనే ఛార్జ్ చేస్తుంది.
5. ప్రేమి విశ్వనాధ్:
కార్తీక దీపం సీరియల్ లో వంటలక్కగా అందరి మనసులను దోచేసిన ప్రేమి విశ్వనాధ్ ఒక్క రోజు కాల్ షీట్ కు యాభై వేల వరకు ఛార్జ్ చేస్తారట. అంటే ఆమె సంపాదన నెలకు 15 లక్షల పైమాటే ఉంటుంది.
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..