మనం జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ మన ఆరోగ్యానికే ఇవ్వాలి. అలా చెయ్యాలంటే మనం మన వంట గదిలో పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ, ఆహరం విషయంలో కానీ, చివరకు వంటగదిలో కూడా పొరపాట్లు చేయకూడదు. మనం తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటాము. అయితే.. వంటగదిలో చేసే పొరపాట్లు మన ఆరోగ్యం మీదకు తీసుకువస్తాయి. అందుకే వంటగదిలో ఈ 7 పొరపాట్లను అస్సలు చెయ్యకూడదు. అవేంటో చూద్దాం.
Advertisement
వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో శుభ్రత పాటించకపోతే లేనిపోని జబ్బులు వస్తాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కిచెన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Advertisement
- రీసైక్లింగ్ బాగ్స్ ను తిరిగి వాడవద్దు. ఒకసారి మార్కెట్ నుంచి కూరగాయలను లేదా ఇతర వస్తువులను తెచ్చుకున్న తరువాత ఈ బాగ్స్ ని తిరిగి వాడకండి.
- మీ వంట గదిలో సామాన్లను క్లీన్ చేసుకోవడానికి ఒకటే స్పాంజ్ ని ఎక్కువ కాలం వాడకండి. మురికి అందులోనే ఉండిపోయి కీటకాలు ఎక్కువ అవుతాయి. ఇది మీరు వండుకునే ఆహారంపై కూడా నెగటివ్ ప్రభావం చూపిస్తుంది.
- వండిన ఆహారాన్ని పడ్డాక ఫ్రిడ్జ్ లో పెట్టడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వలన సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందుతాయి. కాస్త వేడిగా ఉన్నప్పుడే అందరు సర్దేసుకోవడం మంచిది.
- ఎక్కడైనా నూనె ఒలికితే వెంటనే శుభ్రం చేసేయండి. లేదంటే, అది ఇల్లంతా వ్యాప్తి చెంది మరింత జిడ్డుగా మారుస్తుంది.
- మీరు వండుకునే అన్ని ఆహారపదార్ధాలని కడగాలి. మాంసం లాంటివి క్లీన్ చేసాక సింక్ ని కూడా కడగాలి. లేదంటే అవి సింక్ లో పడి ఇతర పాత్రలకు కూడా అంటుకునే అవకాశం ఉంది.
- తరచూ ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయడం ముఖ్యం. లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టె ఆహార పదార్ధాలు కూడా పాడవుతాయి.
- వీలైనంత వరకు ఫ్రిడ్జ్ లో ఆహారపదార్ధాలను ఎక్కువ కాలం నిల్వ చేయకండి. పాలను రెండు నుంచి ఐదు రోజులు, చేపలను మూడు రోజులు, కేక్స్ వంటి వాటిని ఐదు రోజులు, గుడ్లని వారం రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయడం మంచిది కాదు.
Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?
2007 లో ధోనీనే కెప్టెన్గా ఎందుకు BCCI నియమించింది ?
Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్