Home » వంట గదిని ఇలా మార్చితే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే..?

వంట గదిని ఇలా మార్చితే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే..?

by Anji
Ad

భారతదేశం అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా ఎక్కువగా నమ్ముతుంటారు. వాస్తు నియమాల ప్రకారం.. ఇల్లు కట్టుకుంటారు. వాస్తు జ్యోతిష్య ప్రకారం.. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ముందు మంచి, చెడు గురించి చూస్తాం. వ్యాపారమే కాదు.. చాలా మంది హిందువులు ఏ పనిని ప్రారంభించాలనుకున్నా జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు జన్మించినప్పుడు జన్మ నక్షత్రం, ఏదైనా శుభకార్యాలు, పెళ్లి ముహుర్తాలు, ఇలా రకరకాలకు జ్యోతిష్యులను సంప్రదించడం పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితి. అయితే ఇంట్లో కూడా వంటగదిని శాస్త్రం ప్రకారం.. నిర్మిస్తుంటారు కొందరు. వంటగదికి ఇంటికి ఓ గుండెకాయ లాంటిది. వంట గదిని ఏ దిశలో కట్టుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Advertisement

ఇంట్లో వంట గది సరైన వాస్తు ప్రకారం.. లేకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయట. దీంతో ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశముంటుందట. కాబట్టి వంటగది విషయంలో చాలా చిట్కాలు పాటించడం చాలా మంచిది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వంటగదిని అంగారకుడు పాలిస్తాడట.. ఎందుకంటే వంటగదిలో ఎక్కువగా పాత్రలు, కత్తులు, మసాలా, పప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆగ్నేయ దిశలో ఉంటే చాలా మంచిది అని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటారు. అంతేకాదు.. వంటగది వాయువ్య ఆగ్నేయ దిశలో కట్టిన సమయంలో తలుపులు తూర్పు దిశగా ఉండాలి. 

Advertisement

 

అదేవిధంగా వంటగదికి ఒక కిటికి పడమర దిక్కున ఉంటే చాలా మంచిదట. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. దీంతో ఆ ఇల్లు చాలా బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. సిలిండర్ ను ఆగ్నేయ దిశలో ఖాళీగా ఉంటే నైరుతి దిశలో ఉంచడం చాలా మంచిదని.. మసాలాలు పప్పు దినుసులను దక్షిణం లేదా పడమర ముఖంగా ఉంచితే బాగుంటుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఫ్రిడ్జ్ మరియు వాటర్ ఉత్తరం దిశలో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన వాస్తు నియమాలను పాటిస్తే వంటగదిలో తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనవంతులు అవుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు మీ వంటగదిని ఇలా మార్చుకొని ధనవంతులు అవ్వండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 పరగడుపున ఈ రసాన్ని అస్సలు మిస్ కావద్దు.. దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ముక్కుపై పింపుల్స్ వస్తున్నాయా? అయితే అసలు కారణం ఇదే.. తప్పక జాగ్రత్తపడండి..!

చిన్న పని చేసినా చెమటలు కక్కేస్తున్నారా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

Visitors Are Also Reading