టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు(56) శనివారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. రమేష్ బాబు మరణవార్త అభిమానులందరినీ తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ సోకింది.
Advertisement
Advertisement
అయితే 1974లో అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు రమేష్‌బాబు. మనుషులు చేసిన దొంగలు, పాలు నీళ్లు, నీడవంటి చిత్రాలలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. హీరోగా సామ్రాట్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రి ఇచ్చారు. దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, ‘పాలు నీళ్ళు’ ‘బ్లాక్ టైగర్’ చిన్నికృష్ణుడు, కలియుగ కృష్ణుడు, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, ఆయుధం, నావళ్లే, నాఇల్లే నా స్వర్గసీమ, మామకోడలు, అన్నాచెల్లెలు, పచ్చతోరణం, ఎన్కౌంటర్ వంటి మొత్తం 17 సినిమాల్లో నటించారు రమేష్‌బాబు.
నటుడిగా కలిసి రాకపోవడంతో 1997 నుంచి ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా దూకుడు చిత్రానికి నిర్మాతతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు.