Home » బీరువాలో వీటిని పెట్టడం వల్ల అప్పులు తీరుతాయి…ఆదాయం వస్తుంది!

బీరువాలో వీటిని పెట్టడం వల్ల అప్పులు తీరుతాయి…ఆదాయం వస్తుంది!

by Bunty
Ad

మనలో చాలామంది కష్టపడి పని చేసినప్పటికీ వేలలో మాత్రమే డబ్బు చేతికి అందుతుంది. ఆ సంపాదించిన డబ్బు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ మోతాదులో డబ్బు ఖర్చు అవుతుంది. ఇలా అధిక ఖర్చులతో బాధపడేవారు… చేతిలో డబ్బు నిలవని వారు ఇంట్లో డబ్బులు పెట్టే చోట ఈ వస్తువులను ఉంచడం వల్ల సమస్యలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. ఐశ్వర్యం కలగాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు పెట్టాలని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇంట్లో సరైన స్థలంలో బీరువాను ఉంచాలి. బీరువాను ఇంట్లో నైరుతి దిశలో పెట్టాలి. అలాగే పడమర నైరుతి, దక్షిణ నైరుతి అని రెండు రకాలుగా ఉంటాయి.

Advertisement

మనం దక్షిణ నైరుతిలో బీరువాను ఉంచాలి. బీరువా తలుపులు తెరవగానే అవి ఉత్తరం దిక్కున చూడాలి. ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడు. కుబేరుని స్థానం ఉత్తరం. బీరువా తలుపులు ఉత్తరం వైపు ఉండడం వల్ల కుబేరుడు వచ్చి బీరువాలో నివాసం ఉంటాడు. అలాగే చాలామంది తెలిసి తెలియక బీరువాలో ఎర్రటి వస్త్రాలను ఉంచుతారు. అసలు బీరువాలో ఎర్రటి వస్త్రాలను ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు. బీరువాలో తెల్లటి వస్త్రాలను ఉంచాలి. నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే బీరువాలో డబ్బు పెట్టే చోట తెల్లటి వస్త్రాన్ని ఉంచాలి. అలాగే బీరువాలో తలుపుకు కుడి చేతిలో బంగారు నాణాలు వర్షిస్తూ, వరద ముద్రలో పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి చిత్రం ఉంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

Advertisement

అలాగే లక్ష్మీదేవికి వట్టివేలు అంటే చాలా ఇష్టం. కనుక లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు వట్టివేరు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అలాగే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. కనుక విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని, లక్ష్మీదేవికి ఇష్టమైన వట్టివేరును ఒక వెండి పాత్రలో ఉంచి బీరువాలో ఉంచాలి. ఇలా ఎవరైతే బీరువాలో ఉంచుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని… డబ్బుకు అసలు కొదవ ఉండదని పండితులు అంటున్నారు. ఈ నియమాలను కచ్చితంగా పాటించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆదాయం పెరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా…?

కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!

మోహన్ బాబు మొదటి భార్య ఎవరి వల్ల చనిపోయిందో తెలుసా…?

Visitors Are Also Reading