పూర్వకాలం నుంచి మన పెద్దలు అనేక విశ్వాసాలను నమ్ముతూ ఉంటారు. అలాగే పెద్దవారితో పాటు పిల్లలకు కూడా అలాంటి విశ్వాసాలను చెబుతూ వస్తున్నారు. అయితే కొన్ని విశ్వాసాలు నిజమవుతాయి. అలాంటి వాటిలో ఒకటి తలలో రెండు సుడులు. అయితే ఈ విధంగా ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు అవుతాయని…ఇద్దరు భార్యలు ఉంటారని… పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతుంటారు. మరి దీనికి పండితులు ఏమని సమాధానం చెబుతున్నారంటే… తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు. పెద్దలు ఆ విధంగా సామెత చెబుతూ ఉంటారు.
Advertisement
తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని ఎక్కడ చెప్పలేదు. అలా ఎక్కడైనా జరిగితే అది యాదృచ్ఛికమే. కానీ ఈ విషయం అనేది నిజం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలలో రెండు సుడులు ఉండడం అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఉన్నవారు సాధారణ వ్యక్తుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అనేక విషయాలలో వారు ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి వారికి మేలు చేస్తాయి.
Advertisement
అలాగే ఏ విషయంలో అయినా సరే దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ వ్యక్తులు అంత సులభంగా మోసపోవడం… మోసగించే గుణం కూడా ఉండదు. కష్టపడి పైకి వస్తారు. తలలో రెండు సుడులు ఉన్నవారు భిన్నంగా ఆలోచిస్తారు. ఎల్లప్పుడూ సృజనాత్మకత కోరుకుంటారు. చాలా చురుగ్గా ఉంటారు. జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు… ఏ రంగంలో అయినా రాణించేందుకు అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తలలో రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు జరగవు.
ఇవి కూడా చదవండి
SS Rajamouli : జక్కన్నకు అరుదైన గౌరవం.. ఐఎస్బీసీ చైర్మన్గా నియామకం
కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!
మోహన్ బాబు మొదటి భార్య ఎవరి వల్ల చనిపోయిందో తెలుసా…?