Home » టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?

టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?

by Bunty
Ad

టీమిండియా జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక్క ఐసీసీ టోర్నమెంట్ కూడా కొట్టలేదు టీమిండియా. ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో గెలిచి.. ఐసీసీ టోర్నీ నీ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ రోహిత్ శర్మ సేన దారుణంగా విఫలమైంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది.

Advertisement

దీంతో రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ పెరిగింది. అన్ని ఫార్మాట్ లో నుంచి రోహిత్ శర్మాను తొలగించాల్సిందేనని కొంతమంది క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎవరైనా యంగ్ స్టార్స్ కు కెప్టెన్సీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ తరణంలో టీమిండియా కెప్టెన్ గా అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది.

Advertisement

అయితే ఇది బీసీసీ సెలక్టర్ల నుంచి వచ్చిన మాట కాదు. టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం తాజాగా కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ… అశ్విన్ అద్భుతమైన క్రికెటర్లలో ఒకడు అని తెలిపారు. ఆసియా గేమ్స్ లో బీసీసీఐ అశ్విన్ కు భారత కెప్టెన్ గా అవకాశం ఇస్తుందని భావిస్తున్నానని తెలిపారు డీకే. టీమిండియా కెప్టెన్ గా ఉండేందుకు అన్ని అర్హతలు రవిచంద్రన్ లో ఉన్నాయని నేను నమ్ముతున్నానని దినేష్ కార్తీక్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

బట్లర్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

Visitors Are Also Reading