టీమిండియా లెజెండరీ క్రికెటర్లలో వివిఎస్.లక్ష్మణ్ ఒకరు. టెస్టు ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సుదీర్ఘ కాలం పాటు టీమిండియా కు టెస్ట్ క్రికెట్లలో టీమిండియాకు సేవలు చేశాడు. సచిన్, గంగూలి, ద్రావిడ్ స్థాయిలో టెస్ట్ క్రికెట్లలో లక్ష్మణ్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉండేది. ఎన్నో మ్యాచుల్లో కీలకపాత్ర పోషించాడు. 2001లో ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్ లో గొప్ప మైలురాయిగా నిలిచాయి. తెలుగు ఆటగాళ్లకు మంచి గుర్తింపును తెచ్చిన ఆటగాడు లక్ష్మణ్.
Advertisement
ఇప్పుడు లక్ష్మణ్ వారసుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. లక్ష్మణ్ కుమారుడు సర్వజిత్ టీం ఇండియాలో ఎంట్రీ కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ లీగ్ లో సర్వజిత్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్ లో 30 పరుగులతో రాణించాడు. ఇక రెండో మ్యాచ్లో భారీ శతకం నమోదు చేశాడు. 209 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం.
Advertisement
అతని షాట్స్ లక్ష్మణ్ ను గుర్తుచేస్తున్నాయి. అయితే సర్వజిత్ త్వరలోనే టీం ఇండియాకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సర్వజిత్ కు ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కనక వస్తే అతని క్రేజ్ మరింత పెరుగుతుంది. అయితే లక్ష్మణ్ వారసుడు ఐపీఎల్ లో కానీ, టీమిండియాలో కానీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఇటీవల సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..