ప్రస్తుతం ఎక్కడ చూసిన సినిమా రీ రిలీజ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ పేరిట థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వీటికి భారీగానే రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే రిలీజ్ కు వెళ్లినట్లు చాలా మందే థియేటర్లకు వెళ్లి మరీ ఈ సినిమాలను చూస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన “తొలి ప్రేమ” సినిమా కూడా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్ రెండు కోట్ల వరకూ ఉందని సమాచారం.
Advertisement
ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కీలక మలుపు అనే చెప్పాలి. అప్పటి వరుకు మెగాస్టార్ తమ్ముడిగానే చలామణి అయిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో యూత్ ఐకాన్ గా మారారు. ఈ సినిమా అప్పట్లోనే ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీ గా నిలిచింది. ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లిస్ట్ చెపితే.. ఆ లిస్ట్ లో తొలిప్రేమ కచ్చితంగా ఉంటుంది. అంతలా ఈ సినిమా ప్రేక్షకుల మదిని కదిలించింది. ఈ సినిమా క్లైమాక్స్ మరో లెవెల్ లో ఉంటుంది. అసలు ఆ క్లైమాక్స్ వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు.
Advertisement
ఈ సినిమాను బిగ్ బీ అమితాబ్ కూడా చూశారట. అయితే ఆ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు కోపంగా రియాక్ట్ అయ్యారట. హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అమితాబ్ చాలా కోపంగా రియాక్ట్ అయ్యారట. వెంటనే కార్ కీస్ ను తీసేసి స్క్రీన్ వైపుకు విసిరేశారట. ఇలా ఎలా తీస్తారు క్లైమాక్స్? ఆ అమ్మాయి అలా ఎలా వెళ్ళిపోతుంది? అంటూ అరిచారట. అంతలోనే జయాబచ్చన్ క్లాప్స్ కొట్టడం చూసి స్క్రీన్ వైపు చూడగా హీరోయిన్ మళ్ళీ వెనక్కి వచ్చి హీరోని హగ్ చేసుకుంటుంది. దీనితో ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను అని అమితాబ్ ఫీల్ అయ్యారట.
మరిన్ని ముఖ్య వార్తలు:
రోహిత్ 2011 ప్రపంచకప్ ఆడకుండా ధోనీ కుట్రలు ?
దిల్ రాజు రెండవ భార్య తేజస్విని బ్యాక్ గ్రౌండ్ ఇదే…!
SRH లోకి తిలక్ వర్మ.. కావ్యా పాప బిగ్ స్కెచ్ ?