Home » భారతదేశంలో ఉన్న ఏకైక పురుష నది ఇదే.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?

భారతదేశంలో ఉన్న ఏకైక పురుష నది ఇదే.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?

by Anji
Ad

భారతదేశంలో నదుల చరిత్ర చాలా పురాతనమైంది. నదులు శతాబ్దాలుగా తమ స్వచ్ఛతను కాపాడుకుంటూ.. నిరంతరం తమ దిశల్లో ప్రవహిస్తుంటాయి. గంగా వంటి పవిత్ర నది గురించి గ్రంథాలు, పురాణాల్లో ప్రస్తావించబడింది. భారతదేశంలో ప్రవహించే గంగా, గోదావరి, నర్మ, సిందు, తుంగభద్ర వంటి నదులన్నింటికీ స్త్రీల పేర్లు పెట్టారు. ఈ కారణంగానే భారతీయ నదులను స్త్రీలతో పోల్చారు. నదిని తల్లిగా.. పవిత్రంగా పూజిస్తారు. నదిస్నానం చేస్తే సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందనే నమ్మకం. భారతదేశంలో ఏకైక పురుష నది కూడా ఉంది. మీరు విన్నది నిజమే. భారతదేశంలో పురుష నది అత్యంత పురాతనమైంది.అది బ్రహ్మబిడ్డగా ప్రసిద్ధి చెందినటువంటి బ్రహ్మపుత్ర నది. ఈ నది యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

వేదాలు, పురాణాల ప్రకారం.. బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మబిడ్డగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ దేవుడు గొప్ప రుషి అని నమ్ముతాడు. శంతనుడి భార్య అమోఘ మహర్షి అందానికి బ్రహ్మ మంత్ర ముగ్ధుడు అయ్యాడని.. వివాహం ఆడాడని చరిత్రలో చెబుతారు. బ్రహ్మ అమోఘాలకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని నమ్ముతారు. బ్రహ్మకు పుట్టిన బిడ్డ కావడంతో అతనికి బ్రహ్మపుత్ర అని పేరు వచ్చిందనే పురాన కథనం ప్రచారంలో ఉంది. భారతదేశంలో ఈ నది పొడవ 2900 కిలోమీటర్లు. ఇది చైనాలోని టిబెట్ మానస సరోవరం ఈ నదికి పుట్టినిల్లు. దీనిని టిబెట్ లో యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు.

Advertisement

మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండో నది ఇది. చైనాలో పుట్టిన బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ లోకి ప్రవేశించింది. ఆ తరువాత అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. ఒకపాయ దక్షిణం వైపునకు ప్రవహించి జమున నది పేరుతో దిగువ గంగ నదిలోకి కలుస్తుంది. దీనినే  పద్మావతి నది అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మరో పాయ మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ నదులు బంగ్లాదేశ్ లోని చాంద్ పూర్ వద్ద బంగాళకాతంలో కలుస్తాయి. ఈ నదిని భారత్ లో దేవతగా పూజిస్తారు. పుష్కర్ లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తరువాత ఈ నదిలో స్నానం చేయాలని ఓ నమ్మకం. బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయడం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మ దోషం తొలగిపోతుందని నమ్మకం. బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయడం వల్ల శారరీక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Amitab: ఆ పవన్ కళ్యాణ్ మూవీ క్లైమాక్స్ చూసి అమితాబ్ అంత పని చేశారా? అసలేం అయ్యిందంటే?

సచిన్‌ను మోయడమా? ముసలోళ్లం.. మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్

 వెంకటేష్ రుద్రవీణ ఎందుకు ఆగిపోయింది.. వెంకటేష్ కి రిజిస్ట్రేషన్ చేసిన టైటిల్ చిరంజీవికి ఎలా ఇచ్చాడు..?

 

Visitors Are Also Reading