Home » సచిన్‌ను మోయడమా? ముసలోళ్లం.. మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్

సచిన్‌ను మోయడమా? ముసలోళ్లం.. మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్

by Bunty
Ad

టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో టీమిండియా తరఫున ఓపెనర్ గా దిగి… జట్టుకు అనేక విజయాలను అందించాడు వీరేంద్ర సెహ్వాగ్. గ్రౌండ్ లో వీరేంద్ర సెహ్వాగ్ అడుగుపెట్టగానే… బౌలర్లు బెంబేలెత్తి పోయేవారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి.. అవుట్ అయ్యేవరకు… బౌలర్లపై సిక్స్లు మరియు ఫోర్ లతో విరుచుకుపడేవాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక వీరేంద్ర సెహ్వాగ్… 2011 ప్రపంచ కప్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.


నిన్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో… ధోని కిచిడీ తినే సెంటిమెంట్ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన అనంతరం… సచిన్ టెండూల్కర్ ను భుజాలపై ఎక్కించుకున్న సంఘటన గురించి కూడా సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Advertisement

Advertisement

సచిన్ చాలా బరువుగా ఉంటాడని… తాము ఆ సమయానికి చాలా ముసలోళ్ళం అయ్యామని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. తాము ముసలి వయసుకు వచ్చాం కాబట్టి భుజాలు చాలా నొప్పిగా ఉన్నాయని… అటు ధోనికి మోకాలి గాయం అయిందని వివరించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ను భుజాలపై ఎత్తుకునే బాధ్యతను యంగ్ క్రికెటర్లకు అప్పగించినట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ను విరాట్ కోహ్లీ తన భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్ చుట్టూ తిరిగాడని వెల్లడించారు వీరేంద్ర సెహ్వాగ్. ఇక 2023 ప్రపంచ కప్ లో… విరాట్ కోహ్లీని ఎత్తుకునేందుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధం కావాలని కోరాడు.

ఇవి కూడా చదవండి

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading