వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈమె తమిళ తెలుగు మలయాళ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు చెల్లెలిగా విలన్ పాత్రలో అద్భుతంగా నటించింది.
Advertisement
ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ మొదటగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చారట. కానీ తాను విలన్ గా మారడానికి గల కారణాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వరలక్ష్మీ మాట్లాడుతూ… మొదటగా ఇండస్ట్రీకి స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చాను. కానీ నేను చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో హీరోయిన్ క్యారెక్టర్ నుంచి విలన్ పాత్రలకి సెట్ అవుతానని అనిపించింది.
Advertisement
అంతేకాకుండా హీరోయిన్గా రాణించాలంటే చాలా గ్లామర్ ఉండాలి. గ్లామర్ గా లేకపోతే ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. సినిమా కథ బాగున్నప్పటికీ గ్లామర్ లేకపోతే ప్రేక్షకులు ఇష్టపడరు. అందంగా లేకపోతే సినిమా అవకాశాలు రావడం కూడా చాలా కష్టం. అలాంటి తలనొప్పులు నేను భరించలేను. అందుకే విలన్ క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని ఏకైక మొనగాడు ?
మీ కనుబొమ్మలు ఇలా ఉన్నాయా? అయితే మీరు ధనవంతులు అవుతారు…!
దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!