Home » ఆక‌ట్టుకుంటున్న రౌడీ బాయ్స్ ట్రైలర్

ఆక‌ట్టుకుంటున్న రౌడీ బాయ్స్ ట్రైలర్

by Anji

టాలీవుడ్ నిర్మాత శిరీష్ త‌న‌యుడు ఆశిష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా రౌడీబాయ్స్‌. ఈ చిత్రానికి శ్రీ‌హ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌థానాయిక‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ శ్రీ‌మ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ శనివారం విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ ఈ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Rowdy Boys Trailer: రౌడీ బాయ్స్‏కు ఎన్టీఆర్ మద్దతు .. ఆకట్టుకుంటున్న ట్రైలర్..  | Jr ntr launches rowdy boys trailer | TV9 Telugu

రెండు క‌ళాశాల‌లో ఇంజినీరింగ్ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్నేహితుల మద్య గొడవలు.. ప్రేమ, అల్లర్లు అన్ని అంశాలు ఈ మూవీ ఉండనున్నట్లుగా కనిపిస్తోంది. ట్రైల‌ర్ విడుద‌ల చేసిన అనంత‌రం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ ముందస్తుంగా భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది నాకు నోస్టాల‌జిక్ డే. ఆది సినిమా స‌మ‌యంలో దిల్‌రాజుతో, శిరీష్‌తో అసోసియేష‌న్ ఏర్ప‌డింది. మా శిరీష్ అన్న కొడుకు, సోద‌ర స‌మానుడు ఆశీష్‌తో అప్ప‌టివ‌ర‌కు ప‌రిచ‌యం లేదు. ఇప్పుడు త‌ను రౌడీబాయ్స్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు.

Jr NTR Chief Guest To Rowdy Boys Movie Trailer Launch Event On 9th January  - Sakshi

త‌న సినిమా ట్రైల‌ర్‌ను నేను విడుద‌ల చేయ‌డం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రాజుగారితో, శిరీష్‌గారితో ఉన్న జ‌ర్నీని గుర్తు చేసుకున్న‌ట్టు అయిందని పేర్కొన్నారు. రౌడీబాయ్స్ ట్రైల‌ర్‌ను లాంచ్ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు వారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్‌కు డైరెక్ట‌ర్ శ్రీ‌హ‌ర్ష‌కు అభినంద‌న‌లు. ముఖ్యంగా ఆశిష్ గురించి మాట్లాడిన‌ట్ట‌యితే మా ఇంట్లో వ్య‌క్తి గురించి నేను మాట్లాడుకుంటున్న‌ట్టు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి చిత్రాల్లో త‌ను భాగం కావాల‌ని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే  స్టార్ హీరో ఎవరంటే.. | Rowdy Boys Movie Trailer releasing today at 6PM to  be Launched by Jr. NTR | TV9 Telugu

రౌడీబాయ్స్ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోవిడ్ స‌మ‌యంలో విడుద‌ల‌వుతున్న రౌడీబాయ్స్ మంచి చిత్రంగా మ‌న‌కు గుర్తుండిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్రేమ‌దేశం చూసిన ఎగ్జ‌యిట్‌మెంట్ వ‌చ్చింది. నాకే కాకు మీ అంద‌రికీ కూడా అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లుగుతుంద‌ని మ‌న‌సారా న‌మ్ముతున్నాను అని పేర్కొన్నారు. వైవిధ్య‌మైన సినిమాల‌ను, మంచి సినిమాల‌ను ఆద‌రించే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తార‌నే న‌మ్మ‌కముంది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ.. సినిమాను థియేట‌ర్ల‌లో చూసి సినిమాకు ఘ‌న విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు ఎన్టీఆర్‌.

Visitors Are Also Reading