ఐపీఎల్ 2023 టోర్నమెంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. టోర్నమెంట్లో చివర నుంచి రెండో ప్లేసులో నిలిచి… క్వాలిఫై కి చేరకుండానే ఇంటి ద్వార పట్టింది హైదరాబాద్ జట్టు. ఓవరాల్ గా టోర్నీ మొత్తం లో… కేవలం రెండంటే రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు… అందరి అంచనాలను తారుమారు చేసింది.
Advertisement
ఇక ఈ తరుణంలోనే హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చేయాలని ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం జట్టు మెంటర్ గా ఉన్న బ్రియన్ లారా , హైదరాబాద్ కెప్టెన్ మర్క్రమ్ ను ఇంటికి పంపించాలని కావ్య మారన్ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని హైదరాబాద్ జట్టుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. అలాగే గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ను హైదరాబాద్ జట్టులోకి తీసుకోవాలని కావ్య మారన్ నిర్ణయం తీసుకున్నారట.
Advertisement
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృద్వి షాను కూడా హైదరాబాద్ జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ వేస్తున్నారట. వీరిద్దరూ హైదరాబాద్ జట్టులోకి వస్తే… బ్యాటింగ్ విభాగం చాలా బలంగా తయారవుతుందని… ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం ఆలోచన చేస్తుండట. మినీ వేలంలో ఎలాగైనా వీరిద్దరిని దక్కించుకోవాలని హైదరాబాద్ జట్టు బిగ్ స్కెచ్ వేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కాగా గత ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృద్వి షా చాలా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
అత్త చేతిలో ధోని వ్యాపారం..ఏకంగా రూ.800 కోట్లు !
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు