టీమిండియా మాజీ బౌలర్ పై జహీర్ ఖాన్ పై వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ తరపున ప్రస్తుతం ఆస్ట్రేలియాతో యాషెస్ ఆడుతున్న జేమ్స్ అండర్సన్ కంటే జహీర్ ఖాన్ బెస్ట్ బౌలర్ అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇటీవలే రణవీర్ అల్లాబాడి యూట్యూబ్ షోలో పలు ఆసక్తికరవిషయాలను వెల్లడించాడు ఇషాంత్. ముఖ్యంగా “అండర్సన్ బౌలింగ్ శైలి చాలా భిన్నంగా ఉందని.. అతను బౌలింగ్ పిచ్ లపైనే మెరుగ్గా ప్రభావం చూపగలడు. భారత్ లో అతను ఆడి ఉంటే ఆ ప్రభావం చూపలేకపోవచ్చు. నా వరకు అతని కంటే కూడా జహీర్ ఖాన్ చాలా మెరుగైన బౌలర్” అని పేర్కొన్నాడు.
Advertisement
అదేవిధంగా భారత్ కి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్న వెంటనే.. జట్టులోకి ఫిట్ నెస్ సంస్కృతిని తీసుకొచ్చాడని.. అదే ఇప్పుడు టీమ్ లోకి తప్పనిసరి అయిందని తెలిపాడు ఇషాంత్. ఇదిలా ఉంటే.. యువ ప్లేయర్లు రాణించడంతోనే ఇషాంత్ వంటి సీనియర్లకు టీమిండియాలో స్థానం లభించడం లేదు. ఇషాంత్ ఇప్పటివరకు భారత్ తరపున 105 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు.
Advertisement
ఇషాంత్ శర్మ టెస్ట్ ల్లో 311 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఇషాంత్ పేరిట 11సార్లు 5 వికెట్ హాల్, ఒకసారి 10 వికెట్ల హాల్ ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు 80 వన్డేలు ఆడిన ఇషాంత్ 115 వికెట్లను పడగొట్టాడు. అయితే 14 టీ 20లు మాత్రమే ఆడిన ఇషాంత్ అందులో కేవలం 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. మరోవైపు జులై 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విండిస్ తో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లను ఆడబోతుంది. ఈ సిరీస్ లో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
దినేష్ కార్తీక్ లాగే… భార్య చేతిలో మోసపోయిన బ్రెట్ లీ, దిల్షాన్