Weekly Rasi Phalau in Telugu 2023 : రాశిఫలాలు చదవడం వల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది. ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 18.06.2023 నుంచి 24.06.2023 వరకు మేషం :
ఉద్యోగపరంగా, ఆర్థికంగా అదృష్టం అంతా కలిసొస్తుంది. కొత్త ప్రయత్నంతో ముఖ్యమైన పనులు అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. పథకం ప్రకారం.. కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించినంతగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశముంది.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలకు చాలా వరకు అనుకూలమైన సమయం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం చోటు చేసుకుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సామరస్యంగా ముందుకు సాగుతుంది.
Weekly Horoscope in Telugu : మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించడం కంటే చాలా ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకపోవడం చాలా ఉత్తమం.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
వృత్తి, ఉద్యోగాలపరంగా ఈ వారం అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో మాత్రం కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశముంది. వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్పలితాలను ఇస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారిపోతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం కలుగుతుంది.
Weekly Horoscope in Telugu : సింహం
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి లేదా పని భారం పెరుగుతుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
Advertisement
Weekly Horoscope in Telugu : కన్య
ఆర్థిక పరిస్థితి కొంత వరకు కుటుంబ పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ముఖ్యంగా సహచరుల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
Weekly Horoscope in Telugu : తుల
ఎవరి వృత్తుల్లో వారు బిజీ అవుతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆశించిన పురోగతికి అవకాశముంది. ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు కలిసొస్తాయి. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు విజయవంతంగా పూర్తి అవుతాయి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుంది. వ్యాపారం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొద్దిగా లాభాలు తగ్గే ప్రమాదముంది.ఆర్థిక పరిస్థితి యధాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతం డబ్బు ఇవ్వడం, తీసుకోవడం అంతా శ్రేయస్కరం కాదు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశముంది. బంధు, మిత్రుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
సమయం అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయత్నాలతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితానికి అంతా మంచి జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభం పెరుగుతుంది.
Weekly Horoscope in Telugu : మకరం
వృత్తి, ఉద్యోగాల పరంగా ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు పురోగతిని సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఆర్థికంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మీ జీవితం మలుపు తిరిగే శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
Weekly Horoscope in Telugu : కుంభం
ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. మొండి బాకీలు వసూలయ్యే అవకాశముంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించాలి. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడుతాయి.
Weekly Rasi Phalau in Telugu : మీనం
ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతాయి. మీకు డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇస్తారు. శుభకార్యాల విషయంలో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే అవకాశముంది. కోపం తగ్గించుకోవడం చాలా ఉత్తమం.